Saturday, 17 October 2026

#కాలభైరవఅంటేశివుడు కి ఎందుకు ఇష్టం ?చదివితే గ్రామ సింహంను పూజిస్తారు.🔱 #FamousKalabhairavaSwamyTemple శ్రీ కాలభైరవ స్వామి పరమేశ్వరుని యదార్థ స్వరూపం. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్కఅనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్కఅంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. అందుకే ధర్మపరులైన కాలభైరవ సాధకుల, గురువుల పండితుల జోలికి అనవసరంగా ఎవరూ రారు. యదార్ధమైనటువంటి కాలభైరవ సాధకులు గురువులు ఎవరు జోలికి వెళ్లరు వారి పరిమాతరం వారు చేసుకుంటారు చాలా మితంగా మాట్లాడుతారు. వారి జీవితాన్ని ధర్మబద్ధంగా గడుపుకుంటూ లాభాపేక్ష లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటారు అందరికీ శుభాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు లోక శ్రేయస్సు కోసం వారు ఎన్నో బృహప్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారి దృష్టి లోకంలో అందర్నీ కూడా జ్ఞానవంతులను చేయాలి ధర్మాత్ములను చేయాలి అధర్మాన్ని ఖండించే ధీరులుగా మార్చాలి అనే భావన చేస్తూ ఉంటారు అటువంటి గురువులు మహోన్నతమైన గురువుగా పేరు పొందుతున్నారు పరమ పూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ వారు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటానుకోట్ల మంది భక్తులను కలిగినటువంటి వీరు వారి యొక్క ప్రవచనాలతో కష్టాలలో ఉన్నటువంటి ఎంతో మందిని ఉద్ధరిస్తూ ఉన్నారు వారికి మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. వారికి దరమైన మార్గాన్ని బోధిస్తూ వారి జన్మను సార్ధకతం చేస్తూ ఉన్నారు. దుఃఖ రహిత సమాజం కోసం పోరాడుతూ ఉన్నారు. సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు మన పురాణాల ప్రకారం #అసితాంగభైరవుడు, #రురుభైరవుడు, #చండభైరవుడు, #క్రోథభైరవుడు, #ఉన్మత్తభైరవుడు, #కపాలభైరవుడు, #భీషణభైరవుడు, #సంహారభైరవుడు అని 8 రకాలు. వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 6 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. ప్రపంచంలోనే భక్తులకు నానాలను ప్రసాదంగా ఇచ్చే ఏకైక శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం ఆర్యాపురం అఖండ గోదావరి నది తీరం రాజమండ్రి.స్వర్ణాకర్షణభైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె,డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి. కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు ''ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే, తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌'' అని ప్రార్థిస్తారు. మన దేశంలో కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలలోఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. ఎన్నో యుగయుగాల నుండి మహోన్నతమైన గ్రంథాలలో దాగివున్న పరమ సత్యాలను ని కూడా రహస్యాలను ధర్మాలను మహామంత్రాలను సామాన్య ప్రజలకు సైతం ప్రపంచవ్యాప్తంగా కాలభైరవ తత్వాన్ని ప్రచారం చేయుచున్న భారతీయ సనాతన ధర్మ కాలభైరవ తత్వ ప్రచారకులు నిరాడంబరులు నిత్యాగ్నిహోత్రులు పరమ పూజ్య శ్రీ శ్రీ కాలభైరవ స్వామి వారికి కోటి కోటి ప్రణామాలతో ప్రణామాలతో.. కాలభైరవ గురుపరివార ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగా ఉంటాడు. నేపాల్‌ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజంవ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరంనారదాది యోగిబృంద వందితం దిగంబరంకాశికా పురాధినాథ కాలభైరవంభజేఆధునిక కాలంలో కాలభైరవ గురు పరమ పూజ కాలభైరవ స్వామీజీ వేలాది సంవత్సరాలుగా వెలుగుచూడని కాలభైరవ రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చాటి చెప్పుచున్నారు. తమ కాలభైరవ గురు సంస్థానమఠం నిర్వహించే కాలభైరవ గురు కాలభైరవ టీవీ మీడియా మాధ్యమాల ద్వారా కాలభైరవుని భగవత్‌ స్వరూపాన్ని గురించిన అంశాలపై అసంఖ్యాకమైన మంత్రాలను రహస్యాలను సాధన అందరికీ నేర్పుచు ఉన్నారు. అప్పట్నుంచి 'కాలభైరవ'లోని 'కాల' పదాన్ని నలుపుగా, 'కాలభైరవుని' నల్లటి భైరవునిగా లేదా భయంకరమైన రూపంగా పరిగణిస్తున్నారు. నిజానికి కాలభైరవ గురువు పరమ పూజ కాలభైరవ స్వామీజీ కాలభైరవుడు అంటే శక్తి భైరవునికి (శివునికి) ప్రతిరూపమని, ఈ దేవుడు కాలాన్ని, దాని శక్తిని నియంత్రించగల్గుతాడని చెపుతూ ఉన్నారు. కనుక కాలభైరవుడంటే కాలాన్ని అధీనంలో వుంచుకునే కాల చక్ర భైరవుడు అని అర్థం. ప్రజల బాగోగులు, యోగక్షేమాలు కనిపెట్టుకుని చూసే వాడు, తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే కర్తవ్యమని భావించేవాడు కాలభైరవుడు. ఈయన ఆపడానికి వీల్లేని విధంగా నిరంతరం పురోగమిస్తుంటాడు. మామూలుగా మనందరం 'గడిచిన కాలం తిరిగిరాదు' అని అనేక సందర్భాల్లో అంటుంటాం. ఆ మాటకు తిరుగులేదు. క్షణంలో లక్షోవంతు కూడా వెనక్కి రాదంటే రాదు. అందుకే కాలం అమూల్యమైంది. కనుకనే తెలివైనవాళ్ళు కాలాన్ని వృథా చేయరు. ప్రతి క్షణాన్నీ ఉపయుక్తం చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, పూర్తి భక్తి శ్రద్ధలతో కాలభైరవ స్వరూపుని వేడుకున్నట్లయితే ఆ దివ్య శక్తి నిరంతరం కనిపెట్టుకుని వుండి కాపాడుతుంది. అనేకమంది చిన్న చిన్న సమస్యలను చూసి పెద్దగా బెంబేలుపడ్తూ కాలాన్నంతా వృథా చేసుకుంటూ వుంటారు. నిజానికి కాలభైరవుని గనుక భక్తితో ప్రార్థించినట్టయితే ఎలాంటి సమస్యలయినా ఇట్టే పరిష్కృత మైపోతాయి. ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా కాలభైరవుని ఆరాధించడం అనే వ్యాపకం పెట్టుకుంటే ఇక జీవితంలో ఏ చింతా వుండదు. వీరికి కాలాన్ని వ్యర్థం చేయకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే నైపుణ్యం అలవడ్తుంది. దాంతో అరక్షణం కూడా వృథా చేయకుండా సమయాన్ని మంచి పనులకోసం వినియోగిస్తారు. కాలభైరవుని 'క్షేత్రపాలక' అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు. ఈ సూత్రాన్ని పురస్కరించుకుని గుడి తలుపులు మూసే సమయంలో తాళంచెవులను కాలభైరవుని వద్ద వుంచుతారు. తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు అక్కణ్ణించే తాళంచెవులు తీసుకుని గుడిని తెరుస్తారు. కాలభైరవుడు ప్రయాణీకులకు కూడా రక్షకుడిగా వ్యవహరిస్తాడు. అందుకే సిద్ధులు 'ప్రయాణానికి సన్నద్ధమయ్యేముందు.. ముఖ్యంగా రాత్రులు ప్రయాణించేమాటుంటే కాలభైరవునికి లవంగాల మాల యాలకుల మాల బాదం గింజల మాల జీడిపప్పుల మాల నివేదించి, దీపారాధన చేసి పూజించాలని, అలా చేసినట్లయితే ప్రయాణ సమయంలో ఆయన రక్షణగా వుంటాడని' చెప్తారు. కాలభైరవుని వాహనం శునకం. కనుక కుక్కలకు ఆహారం పెట్టి, వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ, అనురక్తితో సాకినట్లయితే, పరోక్షంగా కాలభైరవుని పూజించినట్టే. కాల భైరవాష్టమి. ఇది పరమ పవిత్రమైన రోజు. కాలభైరవుని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అనేక శివాలయాల్లో కాలభైరవుని విగ్రహాన్ని వుంచుతారు. దాంతో అవి మరింత పవిత్ర ప్రదేశాలుగా గుర్తింపు పొందుతాయి. రాజమండ్రిలో గోదావరి తీరాన అత్యంత పురాతనమైన స్వర్ణాకర్షణ కాలభైరవ ఆడవాళ్లు ఉన్నట్టుగా భక్తులు చెబుతూ ఉంటారు. ఇక్కడ స్వామి వారు వాయు ప్రతిష్ట. అనగా కుల మతాలకు అతీతంగా భక్తులందరూ కూడా స్వామివారిని తాకవచ్చు సర్ప హారతి కంకాల హారతి ఇవ్వవచ్చు అభిషేక సుగంధ అభిషేకమును కూడా నిర్వహించుకోవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మంది భక్తులు ఈ ఆదివారాలు అస్తమీలు అమావాస్యలు పౌర్ణమిలో రోజుల్లో తప్పనిసరిగా దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొంది వారి జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉన్నారు. పరోక్షంగా స్వామి వారి యొక్క మహామంత్రాలను గురువు గారి ద్వారా ఉపదేశంగా పొంది వారు సాధన చేస్తూ ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాలలో గురువుగా మహానుభావులుగా పండితులుగా జ్యోతి సిద్ధాంతర కత్తెలుగా అభివృద్ధి సాధిస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 110 మహామంత్రోపదేశాలను మన గురువుగారు ఇక్కడ అనుగ్రహించడం జరిగింది. కాలభైరవుడ్ని ధర్మాచారములో మాత్రమే పూజించాలి అని గురువుగారు తెలియజేస్తూ ఉంటారు. ధర్మాచార్మం అంటే శాఖాహారము సత్వగుణ సంపన్నమైనటువంటి భక్తిశ్రద్ధలతో మాత్రమే ఆరాధించాలని గురువుగారు అందరికీ ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మూర్ఖులు స్వామివారికి మద్యాన్ని మాంసాన్ని పెడుతూ వారి మూర్ఖత్వాన్ని వారి పిచ్చితనాన్ని వారి విరితనాన్ని బయటపెడుతూ ఉంటారు. వారిని ఈ ప్రపంచము భక్తులందరూ కూడా అజ్ఞానులుగా మూర్ఖులుగా భావన చేసి క్షమించు వదిలేస్తుంటారు. ఎందుకంటే మూర్ఖుడుతో అజ్ఞానుతో వాదన చేస్తే వాడి అజ్ఞానము వారు మూర్ఖత్వము తగ్గకపోగా మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇలాంటి తప్పు పనులు చేసేటటువంటి వారికి అప్రాచ్యువండి చెప్పు పనులు చేసే పనులు చేసేటటువంటి వారికి కాలమే బుద్ధి చెబుతుందని భక్తులు వారిని పట్టించుకోరు. అరుణాచలంలోని ఆలయాల్లో భైరవుని ప్రతీకలు వుండటాన వాటిని ప్రత్యేకంగా కీర్తిస్తారు. కాశీలోని కాలభైరవుని ఆలయాన్ని కాలభైరవ ఆరాధకులు తప్పక ( కాశీలో కూడా కొంతమంది అజ్ఞానులు ఇక్కడ మద్యాన్ని స్వామి వారికి ఇస్తూ ఉంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాలి వారు ఎంత పిచ్చితనంతో విరుతనంతో బతుకుతున్నారో) మన ఇంట్లో ఎవరైనా మద్యం తాగితే మనం వారిని దూషిస్తాం తిడతాం బుద్ధి లేదా జ్ఞానం లేదా ఎందుకు ఈ పాడు పని చేస్తున్నావు. తొందరగా పోతావు రోగాలు వస్తాయి అని మనం వారికి బుద్ధి చెబుతూ ఉంటాము అలాంటిది ఈ బుద్ధులేని వాళ్లే దేవుడికి మద్యాన్ని ఇస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి వాడు చెడిపోయింది కాకుండా పరమాత్మను కూడా మద్యం తాగే విధాతగా చూపించడం వాడి పిచ్చికి పరాకాష్ట) దయచేసి సజ్జనులైన భక్తులందరూ కూడా ధర్మాచార్ మార్గంలో కాలభైరవున్నే కాదు సమస్తమైన దేవతల్ని ఆరాధించండి స్వామి వారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీ జన్మను పావనం చేసుకోండి మూర్ఖులు చెప్పేటటువంటి పిచ్చి మాటలు నమ్మి కోరికష్టాలను తెచ్చుకోవద్దు) దర్శించుకుంటారు. సమస్త గ్రహాలకు అధిపతి కాలభైరవుడు. కాలభైరవుని ధర్మాచారంలో పూజించినట్లయితే కాలభైరవుడికి కంకాల హారతి సమర్పించినట్లయితే కాలభైరవుడికి తెల్ల జిల్లేడు పూలను సమర్పించినట్లయితే కాలభైరవుడికి కాలభైరవ మంత్రం రోజు 11 జపించినట్లయితే ఒక్క రాహు కేతు శని గ్రహదోషాలే ఏ దోషమైన సరే కేవలం కొన్ని రోజుల్లో సమూలంగా నివారణ అవుతుందని భక్తులు యొక్క ప్రగాఢ విశ్వాసం. శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం రాజమండ్రిలో భక్తులకు స్నానాలను ప్రసాదంగా ఇస్తారు ఈ విధంగా భక్తులకు నానాలను ప్రసాదంగా ఇచ్చే ఏకైక క్షేత్రంగా వర్ధిల్లుతుంది. గురువుగారు చెప్పేటటువంటి అష్టకమును పారాయణం చేసిన గురువుగారు చెప్పినటువంటి మహా మంత్రములను జపం చేసిన అతి శీఘ్రంగా సమస్తమైన గ్రహదోషాల నుంచి శత్రు బాధల నుండి ఈతి బాధలనుండి కష్టాల నుండి విముక్తి అవుతారు.మన దేశంలో కాలభైరవుని దేవాలయాలు అనగానే మనకు గుర్తొచ్చేది రాజమండ్రి గోదావరి తీరం అక్కడ రెండు అంతస్తులలో స్వామివారి కొలువుతీరుంటారు క్రింద క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారి రూపంలో పైన శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ రూపంలో ఉంటారు. రాజమండ్రిలోనే కాకుండా కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా అనగా శ్రీకాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడు దర్శనమిస్తారు. విశాఖపట్నంలో, భైరవకోన నిజామాబాద్‌లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది. న్యూఢిల్లి పురానా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైంది. పాండవ సోదరుల రాజధాని ఇంద్ర ప్రస్త నగరంలో ప్రశస్తమైన కాలభైరవ ఆలయం ఉంది. తమిళనాడు, అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవుడున్నాడు. అలాగే కరైకుడి, చోళపురం, అధియమాన్‌ కొట్టయ్‌, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది. కర్ణాటకలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని, నిరంతరం ఆపదలనుండి కాపాడాలని భక్తిప్రపత్తులతో కాలభైరవుని పూజిస్తుంటారు. #LordKalbhauravaBaba #SriKaalBhairavaGod #SreeKalbhauravaNath #KashiKalabhairavaBaba #UjjainKalbhairavaSwamy #Rajahmundry Andhra Pradesh India #WhoIsKalabhairava

Tuesday, 16 June 2026

#WhatIsMantropadesham #mantropadesham #మంత్రఉపదేశంఅంటేఏమిటి #మంత్రోపదేశంఎలాపొందాలి #pujyasrikalabhairavaswamyji #కాలభైరవటెంపుల్_రాజమండ్రి #swarnakarshanabhairavatemplerajahmundry 2026 జూలై 29 గురు పూర్ణిమ రోజున 110వ మంత్రోపదేశం కాలభైరవ గురు సంస్థాన్ మఠం రాజమండ్రి లో అఖండ గోదావరి నది తీరాన జరుగును. *మంత్రోపదేశానికి సంబంధించిన పూజా, హోమ సామాగ్రి మరియు జీవితకాల నిత్య జపసాధన, అభిషేక, తర్పణ సేవల కోసం 1.యంత్రరాజం 2. అనుష్టాన జపమాల 3. మంత్రోపదేశ రక్షా కంకణం 4. శివలింగం 5. నిత్య పూజకు సంబంధించిన స్వామివారి చిత్రపటం మొదలైనవి KGM లో ఇక్కడే అందజేస్తారు*ఇంకా వివరాలకు 9985551028. పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో కోసం క్లిక్ చేయండి. https://youtu.be/oBLl37PBd8s?si=mvJ3gZNclkJrvA2uవాట్సప్ ద్వారా సంప్రదించండి.👍గురువుగారి వాట్సాప్ ఛానల్ ను ఫాలో కాగలరుhttps://whatsapp.com/channel/0029VbB1h4dBfxoE9wSgyq0L

Monday, 16 February 2026

#మాఘఅమావాస్య: పరిహారం17.02.2026, మంగళవారంతిథి ప్రారంభం - Feb 16 సాయంత్రం 05:33 నుండి తిథి ముగింపు - Feb 17 సాయంత్రం 05:30 వరకు.మాఘఅమావాస్య - పితృ తిథి, శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి ప్రీతి తిథి అమావాస్య. #MaghaAmavasya సనాతన హిందూ సంప్రదాయంలో మాఘ అమావాస్య అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన అమావాస్య తిథి. మాఘ మాసంలో చివరి రోజును మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య (మౌనం పాటించే అమావాస్య అంటే అనవసరమైన అక్కర్లేని విషయాలను ప్రస్తావన చేసుకోవడం, మరియు కోపతాపాలన ప్రదర్శించకుండా మౌనంగా మనసులో పరమాత్మ నామాన్ని స్మరణ చేసే పర్వదినం) అని పిలుస్తారు. ప్రతి నెల అమావాస్య ప్రత్యేకమైనది కానీ మాఘ అమావాస్య అసాధారణమైనది. ఈ రోజు పితృదేవతలకు తర్పణం, శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ పూజ, పవిత్ర స్నానం, దానధర్మాలు చేయడం వల్ల అపార పుణ్యం లభిస్తుంది. అమావాస్య మహత్వం - చంద్రుడు అదృశ్యమయ్యే దినంఅమావాస్య అంటే "చంద్రుడు లేని రాత్రి". అమావాస్య రోజు చంద్రుడు పూర్తిగా అదృశ్యమవుతాడు - ఆకాశంలో కనిపించడు. చీకటి రాత్రి.జ్యోతిష్య శాస్త్రం మంత్రం శాస్త్రం ప్రకారం అమావాస్య రోజు చంద్రుడు బలహీనంగా ఉంటాడు. చంద్రుడు మనస్సుకు, భావోద్వేగాలకు, మానసిక శాంతికి కారకుడు. కావున అమావాస్య రోజు మనస్సు కొంచెం అస్థిరంగా, భావోద్వేగంగా ఉంటుంది. కానీ ఇది ఆధ్యాత్మిక సాధనకు, ఈ కాలం ద్వారా వచ్చే సమస్తమైనటువంటి చీకట్లను తొలగించి జ్ఞానాన్ని అందించే శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ నామ జపము చేయుటకు, స్వామిని దర్శించుటకు అత్యంత అనుకూలమైన మహా పర్వదినము.. చీకటి రాత్రి మనల్ని లోలోపల చూసుకునేలా చేస్తుంది. బాహ్య ప్రపంచం నుంచి లోలోపల ఆత్మ వైపు మళ్లించే శక్తి అమావాస్యకు ఉంది. ఈ ఆత్మకు చైతన్య శక్తిని, మనసుకు పరమానందాన్ని, జీవితానికి జన్మ సార్ధకతను ప్రసాదించే సాక్షాత్తు సర్వేశ్వరుడే శ్రీ లక్ష్మీ మాతతో శ్రీ కుబేర స్వామితో ధన ధాన్య స్వర్ణ వజ్ర వైడూర్య మణి మాణిక్యాలతో , దగ దగ దేదీప్యమాన అష్టభైరవ కాంతి కిరణాల మధ్య కొలువుతీరి , ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించే శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారిని దర్శించడం స్వామి నామ జపము చేయడం పూర్వజన్మ సుకృతంగా భావన చేస్తూ ఉంటారు.🔱🪔పూజా విధానం. ఉదయం గాని రాత్రి గాని చేయవచ్చు. శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి చిత్రపటం ఎదురుగాఒక ఇత్తడి పళ్ళెంలో 5రావి చెట్టు ఆకులను ఉంచి, ప్రతి ఆకు పైన ఓం అనే అక్షరాన్ని గంధంతో రాయాలి. ఆ ఐదు రావి చెట్టు ఆకుల పైన పెద్ద మట్టి ప్రమిద (ఎరుపు రంగు) ఉంచాలి. ఆ ప్రమిదలో 8 జ్యోతులు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ మంత్రము జపిస్తూ వెలిగించాలి. "ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం, ధనం, ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా "ప్రతి జ్యోతికి రెండు వత్తులు కలిపి చేయాలి. మొత్తం 8జంటల వత్తులు (16సన్నని వత్తులు జంటగా కలిపి 8) వెలిగించాలి. కొబ్బరి నూనె పోసి వెలిగించాలి.🌳వృక్ష పూజ మాఘ అమావాస్య రోజు రావిచెట్టు (పీపల్ చెట్టు) చాలా ప్రత్యేకమైనది. రావిచెట్టుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారు అని పురాణాలు చెబుతున్నాయి. రావిచెట్టుకు పోయడం, పసుపురంగు దారం 33 మార్లు ప్రదక్షిణం చేస్తూ శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ మంత్రము జపం చేస్తూ కట్టడం వల్ల ఋణదోషాలు తీవ్ర అప్పుల బాధలు నివారణ అగును. ధన వృద్ధి, ధాన్య వృద్ధి స్వర్ణ వృద్ధి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. శనిదోషం, శని సాడేసాతి, అష్టమ శని, శని బాధలు నివారణ అగును. ఉత్తమ జీవిత భాగస్వామి కళ్యాణ సిద్ధి, సంతాన ప్రాప్తి కలుగుతుంది.పితృదోషం తొలగి పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమృద్ధి కలుగుతుంది. శత్రు భయ నివారణ కోసం: శత్రువుల బాధ, శత్రు భయం తొలగును. మానసిక ఒత్తిడి, ఆందోళన, భయం, డిప్రెషన్ తొలగుతుంది. సర్వ పాపాలు హరించబడతాయి. జన్మజన్మాంతరాల పాపాలు, దోషాలు తొలగుతాయి. పితృదోషం పూర్తిగా నాశనమవుతుంది. పితృదేవతలు తృప్తి చెంది అపార ఆశీర్వాదాలు ప్రసాదిస్తారు. తేజస్సు, శక్తి, విజయం, సంతాన సౌభాగ్యం, ఆర్థిక సంపద, ఆరోగ్య దీర్ఘాయుష్షు, మానసిక శాంతి, ఆత్మిక ప్రగతి, కుటుంబ సౌఖ్యం, శత్రునాశనం, సర్వ శుభాలు సిద్ధించాలని ప్రార్థిస్తున్నాం! మీ చుట్టూ రక్షణ కవచం ఏర్పడాలి! శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దివ్య శక్తులు మీకు తోడుగా నిలవాలి!🛕దేవాలయాల్లో, మఠాలలో పీఠాలలో కొబ్బరి నూనె, ఆవునెయ్యి సమర్పణ చేయాలి.మౌనవ్రతం పాటించడంమాఘ అమావాస్యను మౌని అమావాస్య అని పిలుస్తారు కావున ఈ రోజు మౌనవ్రతం పాటించడం అత్యంత శక్తివంతం. ఉదయం నుంచి సాయంత్రం వరకు లేదా పూర్తి రోజు మాట్లాడకుండా ఉండాలి. అవసరమైన పనులు చేయవచ్చు కానీ మౌనం పాటించాలి. ఈ సమయంలో ధ్యానం, మంత్ర జపం, పూజ, పారాయణం చేయాలి. మౌనం పాటించడం వల్ల:మానసిక శక్తి అపారంగా పెరుగుతుంది. వాక్ శుద్ధి పెరుగుతుంది బలపడుతుంది - మళ్లీ మాట్లాడినప్పుడు మన మాటలు శక్తివంతంగా ఉంటాయిఆధ్యాత్మిక అభ్యున్నతి సాధ్యమవుతుందిఏకాగ్రత పెరుగుతుందిఅనవసర వాదోపవాదాల నుంచి దూరంగా ఉండండి.మాఘ అమావాస్య చేయకూడని పనులు:మాఘ అమావాస్య రోజు మాంసాహారం, మద్యం, ధూమపానం, పొగాకు వదిలేయండి - కనీసం ఈ ఒక్క రోజు నల్లని వస్త్రాలు ధరించకండి. ఎందుకంటే అమావాస్య చీకటి రోజు, మళ్లీ నల్లని వస్త్రాలు ధరిస్తే మరింత చీకటి పెరుగుతుంది. తెల్లని, పసుపు, లేత వర్ణ వస్త్రాలు ధరించడం శుభకరం.ప్రతికూల ఆలోచనలు చేయకూడదు - అమావాస్య రోజు మన ఆలోచనలు చాలా శక్తివంతంగా ఉంటాయి, ప్రతికూలంగా ఆలోచిస్తే అవి ప్రతికూలంగానే సాకారమవుతాయి.ఇంటిని, మీ పూజ మందిరాన్ని శుభ్రంగా ఉంచాలి. మురికి ప్రదేశాల్లో ప్రతికూల శక్తులు, చెడు శక్తులు శీఘ్రంగా ప్రవేశిస్తాయి. కావున ఇంటిని శుభ్రం చేసి, ముగ్గులు వేసి, దీపాలు వెలిగించాలి."ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరాయ శీఘ్రం, ధనం, ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా "ఓం శ్రీ కాలభైరవాయ నమః!! ఓం శాంతి శాంతి శాంతిః! #స్వర్ణాకర్షణభైరవదేవాలయం #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ #kalabhairavaswamyji

Thursday, 27 November 2025

#GummadiKayaDeepaalu #KushmandaDeepaalu #KushmandaBaliDeepam #What Is #GummadiKayaDeepaalu #GummadiKayaDeepamSideeffects #KusmandaDeepamSideeffects #KushamandaDeepamVeryDanger⚡ఈ గుమ్మడికాయ బలి హోమ ప్రక్రియలో మంత్ర పూర్వకంగా మాత్రమే చేస్తారు. ఎవరు బడితే వారు ఎక్కడబడితే అక్కడ వెలిగించడం అనర్ధాన్ని కలిగిస్తుంది. #గుమ్మడికాయబలిదీపాలు వెలిగించాలి అంటే తలారా స్నానమాచరించి, తడి బట్టలలో, పండితుల ఆధ్వర్యంలో బలిదాన మంత్రమును పటిస్తూ గుమ్మడికాయని బద్దలు కొట్టి లోపల పసుపు రాసి, ఎనిమిది చోట్ల బొట్లు పెట్టి, అష్టభైరవులను ఆవాహన చేసి, పంచోపచార పూజ చేసి అష్టదిక్కులకు అష్ట జ్యోతిలను మంత్రపూర్వకంగా వెలిగించి ఆ దీపం వెలిగే వరకు అక్కడే కూర్చుని దీపం నిథనమైన తరువాత దానిని దూరంగా ఎక్కడైనా జంతువులు తిరగరాని ప్రదేశంలో వదిలేసి మరలా తలారా స్నానం చేసి, పొడి బట్టలు మార్చుకొని దేవతా దర్శనం చేసుకోవాలి. ఇంటిలో మాత్రం ఎప్పుడూ వెలిగించరాదు. ఇది కొన్ని దోషాలను కలిగిస్తుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు సృష్టిస్తుంది. ఈ గుమ్మడి కాయ బలి దీపాల పట్ల అవగాహన లేని వారు ఎవరో చెప్పిన లేనిపోని మాటలు విని కోరి దోషాలను ఆటంకాలను కోరి తెచ్చుకోవద్దు. అనేది గురువుల యొక్క సలహా. #KalabhairavaTV https://youtube.com/c/Kalabhairavatv