Friday, 27 August 2021

శత్రుముఖ దృష్టిని స్తంభింపచేసి, ఘోర కష్టాలను దూరంచేసే అష్టమి కాలచక్ర పూజ.. శ్రావణ బహుళఅష్టమి రోహిణీ నక్షత్రంలో జన్మించిన దేవాదిదేవుడు, ధర్మస్థాపకుడు, దేవకీ వసుదేవుల అష్టమపుత్రుడు కృష్ణ భగవానుడు. *శ్రీకృష్ణ జన్మాష్టమి* లక్ష్మీ ప్రదమైన మాసం శ్రావణ మాసంలో విశేషపర్వదినము శ్రీకృష్ణ జయంతి కృష్ణపక్ష అష్టమి – కాలాష్టమి, శ్రీకృష్ణాష్టమి:విష్ణువు యొక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయంనుండీ ఉపవాసం (అంటే కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకోవాలి) ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం. రాత్రికి బోజనం చేయటం శుభప్రదం. ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది. మంత్రం. "ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీ ఓం"

No comments:

Post a Comment