Showing posts with label #Kalabhairav Jayanthi 2025 #KalaBhairavashtami. Show all posts
Showing posts with label #Kalabhairav Jayanthi 2025 #KalaBhairavashtami. Show all posts

Saturday, 25 October 2025

#KalaBhairav Jayanthi 2025 #కాలభైరవజయంతి2025 విశిష్టత ఏంటి? 12.12.2025 శుక్రవారం ఎలా పూజించాలి? సవివరంగా మీకోసం! #స్వర్ణాకర్షణభైరవదేవాలయం #పూజ్యశ్రీకాలభైరవస్వామిజీ జీవితంలో ఏదైనా సమస్తమైన కష్టాలను బాధలను దుఃఖాలను శత్రుభయాలను గ్రహభయాలను రోగభయం, ప్రతికూల శక్తులను తొలగించే కాలభైరవజయంతిపూజ. నాణాలను ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం గా వర్ధిల్లుతున్న రాజమండ్రిలో ప్రత్యేకముగా కాలభైరవజయంతి పూజలు, కాలభైరవజయంతి హోమాలు, కాలభైరవ దీక్షలు, కాలభైరవ దీక్షా పూర్ణాహుతి, కాలభైరవ మాలా విరమణ, కాలభైరవ రథ యాత్రలు జరుగును. #KalabhairavaTV #kalabhairaguru Kalabhairav Jayanti Significance In Telugu : ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలంటారు. ఎంత సంపాదించినా మంచి ఆరోగ్యం లేకపొతే వృధానే! ఎన్ని మందులు వాడినా ఫలితం లేని మొండి రోగాల నుంచి విముక్తి పొందడానికి, ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించుకోడానికి కాలభైరవ జయంతి రోజు కాలభైరవుని పూజించాలని మహా మంత్రోపదేశకులు, అంతర్జాతీయ కాలభైరవ తత్వ ప్రచారకులు పరమపూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ వారు ఈ విధంగా వివరిస్తున్నారు. ఈ సందర్భంగా కాలభైరవ జయంతి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఎలాంటి పూజలు చేయాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.ఎవరీ కాలభైరవుడు?సాక్షాత్తు పరమశివుడే కాలభైరవుడు. వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం ఒకానొక సందర్భంలో బ్రహ్మ, విష్ణువు మధ్య విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు? పరతత్వం ఎవరు? అనే అంశం చర్చకు దారి తీసింది. ఈ వివాదాంశం గురించి మహర్షులు 'సమస్త విశ్వానికి మూలమైన పరతత్వం ఒక్క మాటలో తేల్చి చెప్పడానికి వీలు కానిది. ఇందుకు కారణం విష్ణువు బ్రహ్మ ఇద్దరూ ఆ శక్తి విభూతి నుంచి ఏర్పడిన వారే కదా!' అన్నారు ఋషులు. ఈ విషయానికి సంబంధించి బ్రహ్మ దేవుడు, విష్ణువు దేవతలందరితో పాటుగా శివుడిని సంప్రదించారు. ఆ సమయంలో దేవతలందరూ ఒకచోట కూర్చుని ఆ పరమేశ్వరుడే సృష్టికి మూలమని తేల్చారు. అయితే బ్రహ్మదేవుడు దీనిని అంగీకరించకుండా శివుని దూషించాడు. అప్పుడు శివుడు, బ్రహ్మ అహంకార గర్వ భంగం కోసం తన అంశ నుండి కాలభైరవ అవతారము ఆవిర్భవించింది. ఈ బైరవ అవతారానికి కారణమైన రోజు మార్గశిర బహుళ అష్టమి కావడం వల్ల ఆ రోజు "కాలభైరవాష్టమి" గా "కాలభైరవ జయంతి" గా, ప్రసిద్ధి చెందింది.కాలభైరవాష్టమి ఎప్పుడు? ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో బహుళ పక్షంలో అష్టమి తిథి నాడు కాల భైరవ జయంతిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం రోజు కాలభైరవ జయంతి జరుపుకోవాలని పరమ పూజ శ్రీ కాలభైరవ స్వామీజీ వారు సూచిస్తున్నారు. సాధారణంగా కాలభైరవ పూజ రాత్రి సమయాలలో గురు మంత్రాలను, జపం, హోమం నిర్వహిస్తారు. రాజమండ్రిలో ఈ కాలభైరవ జయంతి పర్వదినాన మరియు ప్రతి ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దర్శనం ఉంటుంది. కాలభైరవ స్వరూపంపరమశివుని స్వరూపమైన కాలభైరవుడు ఉగ్రరూపంతో ఉంటాడు. కాలభైరవుని వాహనం శునకం. అంతేకాదు పరమ పావనమైన కాశీ క్షేత్ర పాలకుడు కూడా కాల భైరవుడు. అందుకే వారణాశి వెళ్లిన వారు కాలభైరవుని కూడా తప్పకుండ ధూల్ దర్శనం చేసుకుంటారు. దక్షిణ భారతదేశంలో ఉన్నవారు తప్పనిసరిగా గోదావరి నదీ తీరాన రాజమహేంద్రవరంలో ఉన్న శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని గారెల దండలు, నీలి శంకు పూలదండలు, కార్యసిద్ధి కాలభైరవ దీపాలు సమర్పణ చేస్తారు.కాలభైరవాష్టమి విశిష్టతకాలభైరవాష్టమి రోజున కాలభైరవుడిని పూజించడం ద్వారా రోగ భయం, మృత్యు భయం నుంచి విముక్తి లభిస్తుందని విశ్వాసం. విశేషించి ఈ రోజున కాలభైరవుడిని పూజించిన వారికి అన్ని రకాల వ్యాధుల నుంచి, దుష్టశక్తుల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. అలాగే ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయని, కాల భైరవుని మంత్రం పఠించడం వల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని స్వామీజీ తెలియజేస్తున్నారుకాలభైరవాష్టమి పూజావిధానంకాల భైరవుని జయంతి రోజున కాల భైరవుడితో పాటు కాళీమాతను పూజించాలి. అష్టమి కి ముందు సప్తమి తిథి రోజున అర్ధరాత్రి కాళరాత్రి దేవిని పూజిస్తారు. ఈ తర్వాతే కాలభైరవుడిని పూజిస్తారు. కాలాష్టమి తిథి కాలంలో పరమేశ్వరుడిని కూడా పూజించడం పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున పూజలు చేసే వారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్న భక్తులు రాత్రి జాగరణ కూడా చేయాలి. ఉపవాసం ఉండే వారు రాత్రి వేళ ఉపవాసాన్ని విరమించి పండ్లు, పాలు మాత్రమే తీసుకోవాలి. ఆ మరుసటి రోజే తిరిగి కాలభైరవుని దర్శించిన తర్వాత భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి.కాలభైరవ పూజాఫలంకాలభైరవాష్టమి రోజు కాలభైరవుని పూజించడం ద్వారా శత్రుభయం, అపమృత్యు భయం, రోగభయం తొలగిపోతాయని విశ్వాసం. అలాగే తరచుగా పనులలో ఆటంకాలు ఎదురవుతుంటే కాలభైరవాష్టమి రోజు కాలభైరవుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ప్రతికూల శక్తులు తొలగి పనుల్లో సానుకూలత ఉంటుందని విశ్వాసం. అలాగే ఈ రోజు కాలభైరవుని వాహనమైన నల్ల కుక్కకు కుంకుమతో బొట్టు పెట్టి, గారెలతో తయారు చేసిన మాల వేయడం వలన సమస్త గ్రహ దోషాలు పోతాయని విశ్వాసం. రానున్న కాలభైరవాష్టమి రోజు మనం కూడా కాలభైరవుని పూజిద్దాం సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీ కాలభైరవ స్వామియే నమఃపరమ పూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ వారి శిష్య పరివారం ఆంధ్రప్రదేశ్.