Saturday 15 May 2021

#KalaBhairavaTv#ఎన్నిలక్షలతలలునేలరాలతాయోతెలియదు .. ఆ కురుక్షేత్ర స్థలాన్ని ఏనుగులతో చదును చేయిస్తున్నారు .. పుట్టలు, రాళ్లు, పొదలు, తుప్పలు, చెట్లను తొలగించేస్తున్నారు .అర్జునుడు, వాసుదేవుడు కలిసి ఆ స్థలాన్ని పరిశీలించటానికి వచ్చారు.ఇంతలో ఒక పెద్ద ఏనుగు ఓ చెట్టును అమాంతంగా కూల్చేసింది.పాపం, ఆ చెట్టు తొర్రలో ఓ పిచ్చుక ఉంతుంది.దానికి ఓ గూడు.దానికి నాలుగు పిల్లలు. ఇంకా ఎగరడానికి రెక్కలకు బలం రాలేదు.ఆ నాలుగింటినీ ఇంకెక్కడికో ఎత్తుకుపోయేంత బలం ఈ తల్లి పిచ్చుక రెక్కలకు లేదు. చెట్టుతోపాటు పిచ్చుకగూడు కూడా కిందపడింది. అదృష్టవసాత్తు ఆ పిల్లలకు ఏమీ కాలేదు..ఆ పిట్ట కృష్ణుడిని చూస్తుంది. గుర్తిస్తుంది.ఎలాగోలా బలహీనంగా ఎగురుతూ వెళ్లి కృష్ణుని ఎదుట వాలుతుంది.ఆ రెక్కలతో నమస్కారం పెడుతుంది.అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు.కృష్ణుడికి అన్నీ తెలుసు కదా. చిరునవ్వుతో పిచ్చుక వైపు చూశాడు కృష్ణుడు..వాసుదేవా!!ఏమిటిదంతా..?అడిగింది పిట్ట.యుద్ధక్షేత్రాన్ని చదును చేసే ప్రక్రియ అని బదులిచ్చాడు కృష్ణుడు.రేపు మరో ఏనుగు వస్తుంది, తన కాళ్లతో తొక్కేస్తుంది.మరి నా పిల్లలు ఏమైపోవాలి..?యుద్ధం నా పిల్లల ప్రాణాలతోనే ప్రారంభం కావాలా కృష్ణా....అని బాధతో విలపించింది పిట్ట.కృష్ణుడు ఎటువంటి వాగ్దానం చేయలేదు పక్షికి . మృత్యువు అనివార్య మైతే ఎవ్వరూ ఆపలేరు..రాసి పెట్టి ఉంటే తప్పదమ్మా... కాలచక్రం చాలా కఠినమైనది. దానిపని అది చేస్తుంది.. మన కర్మ క్రియ ఆధారంగానే మృత్యువు ఉంటుంది... నీ ఈ శరీరంతో ఈ భూమి పై ఏమైనా చేయవలసింది మంచి కానీ చేడు గానీ మిగిలి ఉంటే నువ్వు ఉంటావు.. చేయవలసింది ఏమీ లేనప్పుడు కొత్త శరీరం ధరించడం కోసం ఈ శరీరాన్ని వదిలేస్తాము.. దానినే మృత్యువు అంటాము..దాని ముందు నువ్వూ,నేను నిమిత్తమాత్రులమే కదా. అన్నాడు నిర్దయగా.కానీ ఏదో ఆలోచనలో పడ్డాడు.సృష్టికి సూత్రధారివి నువ్వు, నాకు తెలుసులే నీ మాటల మహత్తు.తత్వం బోధించకు స్వామీ. అసలు కాలచక్రమును నడిపేది నువ్వు...నా పిల్లల్ని కాపాడాల్సింది నువ్వే, నీమీదే భారం వేస్తున్నా, ఈ రణరంగం నుండి నువ్వే నన్నూ నా పిల్లలనీ కాపాడువాడివి.. నన్ను నా పిల్లలను రక్షిస్తావో భక్షిస్తావో నీదే భారం...నిన్నే వేడుకుంటున్నాను.. అని మొరపెట్టుకుంది పిచ్చుక.పోనీలే కృష్ణా...మనతో తీసుకుపోదాం, బయట వదిలేద్దాంలే అన్నాడు అర్జునుడు.కృష్ణుడు వారించాడు.పిచ్చుక అసహాయంగా చూస్తూ ఉండిపోయింది.వెళ్లేముందు పిచ్చుకతో. ''నీకూ, నీ పిల్లలకు మూడు వారాలకు సరిపడా తిండిని ఎలాగోలా తెచ్చి పెట్టుకో..'' అన్నాడు.పిచ్చుకకు, అర్జునుడికీ ఏమీ అర్థం కాలేదు.రెండు రోజులు గడిచాయి. సమరశంఖాలు పూరించారు. ఇరువైపులా చతురంగ బలాలు.సమరాంగణం హోరెత్తిపోతున్నది.కాసేపట్లో యుద్ధం ప్రారంభం కాబోతున్నది.కృష్ణుడు ఒకసారి నీ ధనుస్సు ఇవ్వు బావా అనడిగాడు అర్జునుడిని.అర్జునుడు విస్తుపోయాడు. నువ్వు ఆయుధాన్ని ధరించను, ఉపయోగించను, పోరాడను అని ప్రకటించావు కదా బావా. నీకెందుకు మాటతప్పిన అప్రతిష్ట..?నువ్వు ఆదేశించు,నేను నేర వేర్చుతా అన్నాడు అర్జునుడు.కృష్ణుడు మాట్లాడకుండా గాండీవాన్ని తన చేతుల్లోకి తీసుకుని, ఓ బాణాన్ని ఎక్కుబెట్టి, ఘీంకరిస్తున్న ఓ ఏనుగుకు గురిపెట్టి వదిలాడు. ఆ బాణం నేరుగా వెళ్లింది.ఆ ఏనుగు మెడలో కట్టి ఉన్న పెద్ద గంటను తాకింది.ఆ గంటకు ఉన్న తాడు తెగి, గంట కింద పడిపోయింది. అర్జునుడికి నవ్వొచ్చింది. ఏమిటి బావా..?ఈ అపశకునం, ఐనా నీ గురితప్పడం ఏమిటి..? అనడిగాడు.ఆ ఏనుగును చంపేయాలా..? నేను బాణం వదలనా..? అన్నాడు.మాట్లాడకుండా ఆ ధనుస్సు తిరిగి ఇచ్చేసిన కృష్ణుడు తన చేతిలోని పాంచజన్యాన్ని (యుధ్ధశంఖారావం) పూరించాడు.యుద్ధం ప్రారంభమైంది. మొన్న పిట్ట గూడును కూల్చేసిన ఏనుగే అది.భీకరమైన మహవిధ్వంసం కురుయుద్ధం.18 రోజుల్లో అటూ ఇటూ లక్షల తలలు తెగిపడ్డాయి. ఏనుగులు, గుర్రాలు చచ్చిపోయాయి.ఎటు చూసినా కళేబరాలు. తెగిన అవయవాలు. విరిగిన రథాలు.బాణాలు, ధనుస్సులు, ఈటెలు, గదలు. మృత దేహాల పైన ఎగురుతున్న రాబందులు.మృత్యుదేవత వేనవేల కోరలతో తాండవం చేస్తున్న వాసన.అర్జునుడిని తీసుకుని ఆ శవాల నడుమ ఏదో వెతకడం ప్రారంభించాడు కృష్ణుడు.తొలిరోజున తన పడగొట్టిన ఏనుగు గంట కనిపించింది ఓచోట. అలాగే భద్రంగా....అర్జునా, ఆ గంటను పైకి లేపు అన్నాడు కృష్ణుడు. కృష్ణలీలలు ఎప్పటికప్పుడు కొత్తే కదా అర్జునుడికి. మారుమాట్లాడకుండా ఆ గంటను పైకి లేపాడు.అంతే.దాని కింద ఉన్న పిట్ట దాని పిల్లలు నాలుగు రెక్కలను ఒక్కసారి వదిల్చి గాలిలోకి ఎగిరాయి. వాటితోపాటు వాటి తల్లి కూడా.'ఇవి ఆ రోజు పిట్ట పిల్లలేనా..?' అనడిగాడు అర్జునుడు. కృష్ణుడు మొహంలో చిరుమందహాసం. ఇంకా అవి ఏదో చేయవలసింది ఉంది అర్జున అందుకే ఇన్ని లక్షల మంది మృత్యువాత పడిన ఆ పక్షికి పిల్లలకు గంట రక్షణ కల్పించింది అని చెప్పాడు కృష్ణుడు..ఆ గంట అన్నిరోజులపాటు అంత భీకరమైన యుద్ధం నుంచి ఆ చిన్ని కుటుంబాన్ని కాపాడింది.ఇంతకీ ఈ కథలో నీతి ఏమిటి అంటారా..?ఈ కరోనా విద్వంసం వేళ మనకు చెబుతున్న నీతి ఏమిటీ అంటారా..?జాగ్రత్త పడాలి..''గంట దాటి బయటికి కదలకండి,యుద్ధం పూర్తయ్యేంతవరకూ దాని కిందే భద్రంగా ఉండండి.అక్కడ పిచ్చుక, పిచ్చుక పిల్లలు గంట దాటాలేదు.. అవకాశం కూడా లేదు,కాబట్టి బతికి బట్ట కట్టాయి.మరి... మనం..మనకి గడప దాటే అవకాశం వున్నా గడప దాటకుండా ఉంటే చాలు.అదే మీకు రక్ష. మీ కుటుంబానికి రక్ష. మన ఆత్మబంధువులకు రక్ష..."స్టే హోమ్. స్టే సేఫ్.''నా ఆత్మబంధువు అంతా బావుండాలి. మనకు పరిపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించమని పరమేశ్వరుని వేడుకుంటూ.... మీ కాలభైరవ స్వామిజీ

No comments:

Post a Comment