Friday, 8 December 2023
#మార్గశిరబహుళఅష్టమి గురువారం #కాలభైరవాష్టమి #కాలభైరవజయంతి #KalabhiravaTemplehttps://youtu.be/B0r8uZgJGkY?si=i3fNzafKAKcSLHUIఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ కాలభైరవాయనమః భక్తులందరికి కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి శుభాకాంక్షలు..04 జనవరి 2024 మార్గశిర బహుళ అష్టమి హస్త నక్షత్రం గురువారం కాలభైరవాష్టమి కాలభైరవ జయంతి పర్వదినం.*ఈ సంవత్సరంలో కాలభైరవ దీక్ష స్వీకరించుటకు తేదీలు*41రోజులు అనగా మండలం కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.25.11.2023 శనివారం నాడు స్వీకరించాలి..21రోజులు అనగా అర్ధమండలం కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.10.12.2023 ఆదివారం నాడు స్వీకరించాలి https://youtu.be/puxd6WDNJvw?si=yePmeEnxfqDQ3K-O11రోజులు కాలభైరవ స్వామి దీక్ష చేయాలంటే ది.24.12.2023 ఆదివారం నాడు స్వీకరించాలి.5రోజులు కాలభైరవ స్వామి దీక్ష ది.31.12.2023 ఆదివారం నాడు స్వీకరించాలి... కాలభైరవ స్వామి దీక్షా ఇరుముడి సమర్పణ 04 జనవరి 2024 మార్గశిర బహుళ అష్టమి గురువారం కాలభైరవ జయంతి పర్వదినాన.. దీక్షావిరమణ, మాలావిరమణ, మహా పూర్ణాహుతి మహోత్సవం 04 జనవరి 2024 కాలభైరవ జయంతి రోజున సాయంత్రం 4గంటలకు జరుగుతుంది.దీక్షా విరమణ క్షేత్రం.. *రాజమండ్రి కాలభైరవ స్వామి సన్నిధి* ముందుగా కాలభైరవ మూల మంత్రముతో ప్రాణప్రతిష్ట గావించిన 108 సంఖ్యగల రుద్రాక్ష మాల కాలభైరవ స్వామి ముద్రను ముందుగా సిద్ధం చేసుకొని తీసుకురావలను. అనగా ఎవరి దీక్షా మాలను వారే తీసుకురావాలి. ఇంతకు ముందు మీరు కాలభైరవ స్వామి దీక్ష చేసిన మాల ఉంటే ఆ దీక్షా రుద్రాక్ష మాలను ఈ సంవత్సరం కూడా ధరించవచ్చు. కొత్తది అవసరం లేదు. ఎవరైనా సరే అనగా కాలభైరవ స్వామి వారి పట్ల స్వామి వారి మంత్రం పట్ల భక్తి , శ్రద్ధ సంపూర్ణ నమ్మకం ఉన్నవారు అందరూ వారి శక్తి మేరకు సానుకులను బట్టి 41రోజుల, 21రోజుల, 11రోజుల, 5రోజుల దీక్ష చేయవచ్చ. దీక్షను మన తల్లి నుండి లేదా మన నుండి ధర్మాన్ని మాత్రమే ఆశించే గురువు నుండి దీక్ష స్వీకరించుట ఉత్తమం..1. స్త్రీలు పిల్లలు అయితే 21 రోజులు లేదా 11 రోజులు స్వీకరించడం మంచిది.2.ప్రాణ ప్రతిష్ట చేసిన 108 సంఖ్య గల రుద్రాక్షమాల, స్వామి పెండెంట్ ధరించాలి. 3.నీలం రంగు వస్త్రాలు ధరించాలి. 4.ఉదయం, సాయంత్రం పంచోపచార పూజ (గంధం, పువ్వులు, అగరుబత్తి, దీపం, నైవేద్యం సమర్పణ) చేయాలి.5. ఖచ్చితంగా కాలభైరవ స్వామి వారి మంత్రం రోజూ 10మాలలు జపం చేయాలి. ఉదయం లేదా సాయంత్రం జపం చేయవచ్చు. రోజూ కాలభైరవ స్వామి వారి మంత్రం జపం చేయకపోతే ఫలితం ఉండదు. రోజూ భక్తితో జపం చేస్తేనే దీక్ష వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. 6.అందరినీ స్వామీ అని మాత్రమే పిలవాలి.7.బ్రహ్మ చర్యం పాటించాలి. 8.కుటుంబం పోషణ కోసం చేస్తున్న అన్ని పనులు అనగా ఉద్యోగం, వ్యాపారం అన్నీ సజావుగా నిర్వహిస్తూ ఉండాలి. 9.దీక్షాకాలం అంతా కాలభైరవ స్వామి వారి నామ స్మరణ చేస్తూనే ఉండాలి. 10.అనవసరంగా ఎవరితోనూ ఎక్కువ మాట్లాడ కూడదు.. 11.ఇంట్లోనే దీక్షా కాలం అంతా ప్రతీ రోజు పంచోపచార పూజ చేయాలి.12. ఎవరినీ దూషించరాదు. ఎవరిపైనా నిందలు వేయరాదు, ఎవరి పైనా అసత్య ప్రచారం చేయరాదు. భార్యను దేవతలా ఆరాధించాలి. ఇంకా కాలభైరవ స్వామి దీక్ష కోసం మరిన్ని వివరాల కోసం 9000 200 117 కు వాట్సాప్ చేయండి. గురువు గారే స్వయంగా మీకు సలహా మరియు సూచన చేస్తారు. మన కాలభైరవ టీవీ యూట్యూబ్ ఛానెల్ చూడగలరు.#KalabhairavaSwamyకాలభైరవ పంచరాత్ర హోమం*ది. 04.01.2024 కాలభైరవ జయంతి సందర్భంగాకాలభైరవ పంచరాత్ర హోమం 5రోజుల పాటు రాజమండ్రి కాలభైరవ క్షేత్రంలో జరుగును. 31 డిశంబర్ 2023 మార్గశిర బహుళ చతుర్థి ఆదివారం నుండి 04.జనవరి 2024 మార్గశిర బహుళ అష్టమి *కాలభైరవ జయంతి* గురువారం వరకు. రోజూ ఉదయం11 గం.ల వరకు కాలభైరవస్వామి వారికి ప్రత్యేక పూజలు జరుగును. శత్రుబాధల, గ్రహబాధల, ఈతిబాధల నివారణార్థం , ఆయురారోగ్య అష్టైశ్వర్య సిద్ధి కోసం, మంత్రసిద్ధి కోసం, మంగళ యోగం కోసం 5రోజుల పాటు సాయంత్రం.5గం.ల నుండి స్వర్ణాకర్షణ భైరవ, వటుక భైరవ, అష్ట భైరవ, ఉన్మత్త భైరవ, ప్రచండ భైరవ, రుద్ర భైరవ మహాశక్తి మంత్రాలతో కాలభైరవ హోమమ్ 5రోజుల పాటు జరుగును. ఈ కాలభైరవ పంచ రాత్ర హోమమ్ లో భక్తి శ్రద్ధ ఉన్నవారు ఈ 5రోజుల్లో ఏదైనా ఒక రోజు స్వయంగా పాల్గొని ఆహుతులు, ద్రవ్యాలు, పూర్ణాహుతి సమర్పించ వచ్చును. మరిన్ని వివరాలకు: 9000 200 717 కు వాట్సప్ చేయగలరు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment