Friday, 14 November 2025

#మంత్రోపదేశం #Mantropadesham #మంత్రంసాధన చేసేవారు, లేదా మంత్రం పట్ల శ్రద్ధ ఉన్నవారు, లేదా #మంత్రోపాసన చేయాలనుకునేవారు,లేదా జీవిత సత్యాన్ని సాధించాలనుకునేవారు, లేదా జన్మ సార్ధకత కావాలనుకునేవారు, లేదా ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవాలనుకునేవారు, ఈ జన్మకు ముక్తి మోక్షము కావాలనుకునేవారు మంత్ర దేవత యందు, గురువు నందు పూర్తి విశ్వాసము భక్తి శ్రద్ధ చిత్తశుద్ధితో అడిగితేనీ కానీ ఇవ్వకూడదు మంత్రము. ఒక్కొక్కప్పుడు గురువుల అనంత అవ్యాజమైన కృపతో ఇస్తారు. గురువును దర్శించి, భక్తి పూర్వకంగా అడగాలి. శిష్యుని కొంతకాలం పరీక్షించి ఇవ్వాలి గురువు. మంత్రాన్ని ఇవ్వడం అంటే గురువు తన జీవితంలో జపం చేసి సాధన చేసినటువంటి శక్తిని అక్షర రూపంలో దేవతను ఇవ్వడమే. మరియు మంత్రశక్తిని శిష్యునికి ధారబోయడమే మంత్రఉపదేశం.అలా ఉపదేశం పొందినటువంటి శిష్యుడు జీవిత కాలం మంత్ర దేవత యందు గురువు యందు చిత్తశుద్ధి కృతజ్ఞత కలిగి ఉండాలి అప్పుడే మంత్ర దేవత యొక్క అనుగ్రహం చేత శిష్యునికి సర్వ అభిష్టాలు నెరవేరుతాయి.మంత్రాన్ని అక్షరంగా చూసేవాడు, గురువును మనిషిలా చూసేవాడు, విగ్రహాన్ని శిలలా చూసేవాడు ఎన్నటికీ మంత్ర సిద్ధి కలగదు. విగ్రహంపై శిలాదృష్టి, గురువుపై మానుష దృష్టి, మంత్రంపై అక్షరదృష్టి కూడదు. సాక్షాత్ భగవదృష్టి ఉండాలి. ఏ మంత్రమైనా సరే గురు అణుజ్ఞతో, గురు ఉపదేశంతో సిద్ధిస్తుంది. ఇప్పటికే ప్రత్యక్షంగా పరోక్షంగా 109 మంత్రోపదేశములు విజయవంతంగా సంపూర్ణం చేయడం, ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 16450 మంది భక్తులు పాల్గొని తరిస్తున్నారు. మన కాలభైరవ గురు సంస్థాన్ మఠం రాజమండ్రి ఆధ్వర్యంలో #పూజ్యశ్రీకాలభైరవస్వామీజీ వారి పర్యవేక్షణలో #110వమంత్రోపదేశం త్వరలో జరుగునని తెలియజేయుటకు మిక్కిలి సంతోషిస్తున్నాము.ఈ ముఖ్య సమాచారాన్ని ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలనుకునే మన ఆత్మబంధువులకు షేర్ చేయండి. మరిన్ని వివరాలకుhttps://www.facebook.com/kalabhairavaTVమంత్రోపదేశ క్షేత్రం కొరకు క్లిక్ చేయండి.https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=acమరిన్ని వివరాలకు వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చు.📱@9000200117

No comments:

Post a Comment