Wednesday, 30 December 2020

#కాలభైరవదీక్షనియమాలు #KalaBhairavaDeekshaకాలభైరవస్వామి ప్రీతి మాసం మార్గశిరం.కాలభైరవస్వామి వారికి కళ్యాణం జరిగే మాసం మార్గశిరం. కాలభైరవ అష్టమి. కాలభైరవస్వామి వారికి ఇష్టమైన పత్రీ రావి పత్రములు.కాలభైరవస్వామికి ఇష్టమైన పుష్పం నీలిరంగు శంఖం పువ్వులు. జిల్లేడు పువ్వులు. ఉమ్మెత్త పూలు..కాలభైరవ స్వామి ప్రీతికరమైన ద్రవ్యం జలం. www.KalaBhairava.inకాలభైరవ స్వామి ప్రీతి తిలక ధారణ సింధూరం.కాలభైరవ స్వామి అక్షింతలు సింధూరం అక్షితలు. కాలభైరవ స్వామి ఇష్టమైన పూజ దూప, దీపహారతి.కాలభైరవ స్వామి మిక్కిలి ఆనంద పడేది మంత్రం జపిస్తూ జలాభిషేకం, దూప హారతి సమర్పిస్తున్నప్పుడు.కాలభైరవ స్వామి వారికి ఇష్టురాలు మహాకాళీ(కాలికాంబా) కాళీమాత.కాలభైరవ స్వామి వారికి ప్రీతి ఆభరణం నాగయజ్ఞోపవీతం, స్వర్ణ అక్షయ పాత్ర, తలపై చంద్రుడు.కాలభైరవ స్వామి వారికి ఇష్టమైన మంత్రం కాలభైరవ గాయత్రీ కాలభైరవ స్వామి వారికి ఇష్టమైన స్తోత్రం సహస్ర నామ స్తోత్రం.కాలభైరవ స్వామి వారికి ఇష్టమైన అష్టకం కాలభైరవఅష్టకం.మిక్కిలి ప్రీతి నైవేద్యం ఖర్జూరం, ఎండుకొబ్బరి, బెల్లం, చిత్రాన్నము, నల్లమినపగారెలు, కాలభైరవ స్వామి వారు ఇష్టపడే వ్యక్తి ఉన్నదాంతో దాన ధర్మాలు, నిత్యం భగవత్ నామం చేసేవ్యక్తి. KalaBhairava దీక్ష కాలముFollowhttp://www.facebook.com/kalabhairavaTVకాలభైరవ దీక్షకు మండలకాలము అనగా 40 రోజులు, అర్థ మండలము 21 రోజులు, 11 రోజులు, మరియు అష్ట పర్వదిన దీక్ష అంటే 8 రోజులు దీక్ష. . ఏ దీక్ష అయినా కాలభైరవ జయంతి నాటికి దీక్షా విరమణ చేయవలెను. 🔱కాలభైరవ దీక్ష నియమాలు🔱తల్లి స్వహస్తములచే, ధర్మపత్నిచే, జీవిత భాగస్వామి చే, ఎవరూ లేకపోతే, మీ నుండి ఏమీ ఆశించని ఉత్తమ గురువు నుండి, ఆచార్యుల నుండి కూడా స్వీకరించ వచ్చు..ఈ దీక్ష స్వీకరించుటకు అర్హత భక్తి శ్రద్ధ విశ్వాసం మాత్రమే..01. తెల్లవారుజామునే లేచి శిరస్నానం చేయాలి. 02. కాలభైరవ దీక్షలో నీలిరంగు వస్త్రములే ధరించవలెను.03. కాలభైరవ దీక్షలో రుద్రాక్ష మాల మాల ధరించవలెను.04. సూర్యోదయ, సూర్యాస్తమయ కాలంలో స్నానాదులు ముగించుకొని నిర్మలమైన మనస్సుతో పూజ చేయవలెను.05. కాలభైరవ దీక్ష నిత్య పూజలో పంచోపచార 1. గంధం 2. పువ్వులు 3. దూపం 4. దీపం 5. నైవేద్యం. పూజ చేయవలెను. అలా చేయడం రానివారు కనీసం కాలభైరవ అష్టకం తో పూజించి, పువ్వులతో అర్చించి "ఓం క్షేమ్ క్షేత్రపాలాయ నమః" అను మంత్రం 5 మాలలు పఠించవలెను. 06. కాలభైరవ సహస్రనామ స్తోత్రాలు, అష్టకము చదువుకోవలెను.07. కాల భైరవ దీక్షాకాలంలో మీకు నచ్చిన కాలభైరవ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించవలెను. జపానికే ఎక్కువ సమయం కేటాయించాలి.08.కాలభైరవ దీక్ష కాలంలో ఉదయం పలహారం మధ్యాహ్నం బిక్ష, సాయంత్రం ద్రవ పదార్థాలను మాత్రమే స్వీకరించ వలెను. పూర్తిగా శాకాహారం మాత్రమే.09. మద్యపానము, ధూమపానము, అబద్ధాలు చెప్పుట వంటివి పూర్తిగా విసర్జించవలెను.10. నేలపై ఏదైనా చాప దుప్పటి వాడవచ్చు. గర్వము కోపము వదిలిపెట్టి బ్రహ్మా చర్యము, మౌనము పాటించవలెను11. సత్యమునే పలుకవలెను.12. దీక్షా కాలమున అష్టమి పౌర్ణమి అమావాస్య రోజుల్లో మీ గృహంలో కాలచక్ర దీపపూజ చేయండి. కుటుంబ సభ్యులను కూడా మీ పూజలో పాల్గొనేలా చేయండి.13. కాలభైరవ దీక్ష ఆచరించువారు ఎదుటివారిని "స్వామి" అని . స్త్రీలు అయితే "అమ్మ" సంబోధించవలెను14. దీక్షా కాలంలో "మూత్ర" విసర్జనకు వెళ్ళినవారు తప్పకుండా కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. "మల" విసర్జనకు వెళ్ళినవారు తప్పకుండా స్నానం చేయాలి.15.దీక్షలో ఉన్నవారు ఎవర్నీ నిందించడం, తిట్టడం, ఇతరులను బాధ పెట్టడం చేయరాదు...16. దీక్షను మగవారు వయస్సుతో సంబంధం లేకుండా పాటించవచ్చు. ఆడవారు మాత్రం ఋతుక్రమము అనుసరించి 21,11,8 రోజులు స్వీకరించ వచ్చు.దీక్షా కాలమంతా తమ శక్తికొలది రుద్రాంశసంభూతుడైన కాలభైరవ స్వామి వారిని అర్చించి మహాకాళీ కాలభైరవానుగ్రహపాత్రులు కాగలరు.🔱కాలభైరవ ఫలితము🔱కాలభైరవ దీక్ష నియమానుసారం ఆచరించినవారికి సకల సౌభాగ్యములు సమకూరును. భూత ప్రేత పిశాచ శత్రు బాధలు, సకల గ్రహ దోషములు, నక్షత్ర దోషములు తొలగిపోవును. సర్వ సంపదలు కలిగి, ఇహలోక భోగములు, పరలోకంలో శాంతి సిద్ధించును. అత్యుత్తమమైన ఈ దీక్షను నియమానుసారం పాటించి కాలభైరవ అష్టమినాడు, ధనమును (నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక లక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారిని దర్శించి కాలభైరవ జ్యోతిర్ముడిని కాలభైరవ దీక్షా యజ్ఞకుండంలో సమర్పించి జన్మ సాఫల్యం పొందండి... ముక్తి మోక్ష ప్రదాయకమైన, ప్రాచీనమైన, సనాతనమైన, శక్తివంతమైన దీక్షలలోకెల్ల అత్యుత్తమమైనటువంటి కాలభైరవదీక్షను 2002 లో పదుల సంఖ్య తో ప్రారంభమయి ఈ రోజు వేలాది మంది ఈదీక్ష స్వీకరిస్తూ ఉన్నారు..ఈకాలభైరవ దీక్ష దిన దిన ప్రవర్థమానమై అనతికాలములోనే విశ్వవ్యాప్తము కానున్నది. బోళా శంకరుడైన పరమేశ్వరుని రుద్ర స్వరూపం అయిన కాలభైరవదీక్షను స్వీకరించి భైరవానుగ్రహముతో తరించి జన్మరాహిత్యమును ఆత్మానందమును పొందగలరు.కాలభైరవ స్వాములందరు ప్రతి రోజూ పూజ, జపం చేసుకొనుటకు వీలుగా కొన్ని అతి శీఘ్ర ఫలితాలను ప్రసాదించే మంత్రములను లక్ష్మీకుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి స్వాములవారి దివ్యానుగ్రహముతో ఇవ్వబడినది.. వాటిని భక్తి శ్రద్ధ విశ్వాసం కలిగిన వారు అందరూ జపించవచ్చు... మరిన్ని వివరాల కోసం... కాలభైరవ అనుగ్రహ సిద్ధిరస్తు..భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! Swarnakarshana Bhairava TempleKalabhairava Guru Sansthan Mutt Rajahmundry, A.P533104090002 00117 (Phone Working Timings 9Am to 5pm)https://maps.app.goo.gl/j3HcFLHwmRLUSgU56ఇంకా మరిన్ని వివరాలకు మన Youtube channel చూడగలరు. https://www.youtube.com/c/KALABHAIRAVAGURUKalaBhairavaTvhttp://youtube.com/c/Kalabhairavatv ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.9గ.నుండి ఉ.11:45ని. వరకు మాత్రమే ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు.. కాలభైరవగురుసంస్థాన్ మఠం నిర్వహించు సేవలు:*భారతీయ సనాతన,ధర్మ ప్రచారసేవ*ఉచితదర్శనసేవ*ఉచితజలాభిషేకసేవ*ఉచితహారతిదర్శనసేవ*ఉచితధనప్రసాదసేవ*ఉచితఅన్నప్రసాదసేవ*ఉచిత మంత్ర ఉపదేశ సేవ*ఉచిత జాతకపరిహార సేవ*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ *కాలభైరవ గ్రీన్ ఇండియా*108కాలభైరవ విగ్రహ ప్రతిష్ట సంకల్పంభారత్ మాతా కీ జై!!*మరిన్ని వివరాలకు Telegramhttps://t.me/kalabhairavaTvమీజాతకం,సమస్య, మంత్రోపదేశం కోసం వివరంగా పేపర్ పై వ్రాసి, మీఅడ్రస్, ఫోన్ నెంబర్ వ్రాసి,పోస్ట్ ఆఫీస్ లో రిజిస్టర్ పోస్ట్ చేయండి అడ్రస్ కాలభైరవస్వామిజీకాలభైరవగురుసంస్థాన్ మఠంఅన్నప్రసాద సేవా ట్రస్ట్#46-12-35 దానవాయిపేట, రాజమండ్రి 533103. *9618182456www.kalabhairava.inKalabhairavaGuru Sansthan Mutt Annadaana Seva.అన్నదానం భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎప్పుడూ ఒక భాగం. ఈ పవిత్ర సంప్రదాయాన్ని కొనసాగించడంలో మేము మీ మద్దతును కోరుతున్నాము... సేవలో తరించాలంటే GooglePay, PhonePe, Paytm 9000 200 117లేదా Online Annadana Seva. *KALABHAIRAVAGURU SANSTHAN MUTT**Account No:0113020551Kotak MAHINDRA BANK*IFSC:KKBK0007876 *DANAVAIPETA BRANCH..Lakshmi Ganapathi లక్ష్మీ గణపతి మంత్రం"ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనంమే వశమానయ స్వాహా"Vatuka Bhairava."ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం"Batuka Bhairava"ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు బటుకాయ హ్రీం ఓం"SwarnakarshanaBhairava*ఓమ్ నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వ్రుద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా*Dasanama Raksha Mantram"ఓం కపాలి,కుండలీ ,భీమో, భైరవో ,భీమవిక్రమః, వ్యాలోపవీతీ ,కవచీ , శూలీ, శూరః ,శివప్రియః"Unmatta Bhairava Mantra"ఓం హ్రీం హ్రీం ఉం ఉం ఉన్మత్త భైరవాయ సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి"

Monday, 14 December 2020

#SwarnakarshanaBhairavaSwamy Temple Rajamundry A.P. 06.01.21బుధవారంమార్గశిరబ.అష్టమి #కాలభైరవవాష్టమికాలభైరవజయంతి. #స్వామివారిదర్శనం:ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్యరోజుల్లో ఉ.9గం.నుండి ఉ.11:45ని.వరకు మాత్రమే ఉంటుంది. సాయంత్రం దర్శనం ఉండదు ఏ విధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు. వాటి అవసరం లేదు. మనస్సు నిండా భక్తిని విశ్వాసాన్ని నింపుకొని రండి. #డిసెంబర్ 20-12 ఆదివారం, డిసెంబర్ 22-12 అష్టమి,డిసెంబర్ 27-12 ఆదివారం, డిసెంబర్ 39-12 పౌర్ణమి భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!!మన మఠం నిర్వహించు సేవలు:*భారతీయ సనాతన, ధర్మ ప్రచారసేవ*ఉచిత దర్శనసేవ*ఉచిత జలాభిషేకసేవ*ఉచితహారతిదర్శనసేవ*ఉచిత ధనప్రసాదసేవ*ఉచిత అన్నప్రసాదసేవ*మొబైల్ అన్నదాన సేవ*ఉచిత మంత్ర ఉపదేశ సేవ*ఉచిత జాతక పరిహార సేవ*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ *కాలభైరవ గ్రీన్ ఇండియా*108కాలభైరవ విగ్రహ ప్రతిష్ట సంకల్పంభారత్ మాతా కీ జై!!*జనవరి2021_నెలలోదర్శనం03-1-21ఆదివారం, 06_01_21 బుధవారం కాలభైరవ జయంతి.. http://KalaBhairava.inధనమును(నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణభైరవస్వామివారు. గోదావరిగట్టుకాలభైరవ దీక్షాఘాట్,రాజమండ్రి ఆం.ప్ర.*మరిన్ని వివరాలకు Telegramhttps://t.me/kalabhairavaTv*మరిన్ని వివరాలకు Followhttp://www.facebook.com/kalabhairavaTV*మరిన్ని వివరాలకు Subscribehttps://www.youtube.com/c/KALABHAIRAVAGURU *మరిన్ని వివరాలకు KalabhairavaTv.http://youtube.com/c/Kalabhairavatv

#SwarnakarshanaBhairavaSwamy Temple Rajamundry A.P. 06.01.21బుధవారంమార్గశిరబ.అష్టమి #కాలభైరవవాష్టమికాలభైరవజయంతి. #స్వామివారిదర్శనం:ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్యరోజుల్లో ఉ.9గం.నుండి ఉ.11:45ని.వరకు మాత్రమే ఉంటుంది. సాయంత్రం దర్శనం ఉండదు ఏ విధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు. వాటి అవసరం లేదు. మనస్సు నిండా భక్తిని విశ్వాసాన్ని నింపుకొని రండి. #డిసెంబర్ 20-12 ఆదివారం, డిసెంబర్ 22-12 అష్టమి,డిసెంబర్ 27-12 ఆదివారం, డిసెంబర్ 39-12 పౌర్ణమి భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!!మన మఠం నిర్వహించు సేవలు:*భారతీయ సనాతన, ధర్మ ప్రచారసేవ*ఉచిత దర్శనసేవ*ఉచిత జలాభిషేకసేవ*ఉచితహారతిదర్శనసేవ*ఉచిత ధనప్రసాదసేవ*ఉచిత అన్నప్రసాదసేవ*మొబైల్ అన్నదాన సేవ*ఉచిత మంత్ర ఉపదేశ సేవ*ఉచిత జాతక పరిహార సేవ*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ *కాలభైరవ గ్రీన్ ఇండియా*108కాలభైరవ విగ్రహ ప్రతిష్ట సంకల్పంభారత్ మాతా కీ జై!!*జనవరి2021_నెలలోదర్శనం03-1-21ఆదివారం, 06_01_21 బుధవారం కాలభైరవ జయంతి.. http://KalaBhairava.inధనమును(నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణభైరవస్వామివారు. గోదావరిగట్టుకాలభైరవ దీక్షాఘాట్,రాజమండ్రి ఆం.ప్ర.*మరిన్ని వివరాలకు Telegramhttps://t.me/kalabhairavaTv*మరిన్ని వివరాలకు Followhttp://www.facebook.com/kalabhairavaTV*మరిన్ని వివరాలకు Subscribehttps://www.youtube.com/c/KALABHAIRAVAGURU *మరిన్ని వివరాలకు KalabhairavaTv.http://youtube.com/c/Kalabhairavatv

Friday, 20 November 2020

#భైరవష్టమి2020, #భైరవజయంతి2020, కాలా-భైరవ అష్టమి మరియు కాలా-భైరవ జయంతి అని కూడా పిలువబడే కాలభైరవ అష్టమి, కాలభైరవ స్వామి వారి (శివుని యొక్క రుద్రాంశ సంభూతుడు) పుట్టినరోజును జరుపుకునే హిందూ పవిత్ర పర్వదినం. కాలభైరవ దీక్షతో ఎదైనా పొందవచ్చు. 41 రోజులు 21 రోజులు 21 రోజులు 8 రోజులు. స్త్రీలు పురుషులు పిల్లలు ఎవరైనా విజయం కోసం చేయవచ్చు. https://youtu.be/xBVexnCtXC8 2020 కాలభైరవ జయంతి ఎప్పుడూ చెయాలి? https://youtu.be/h7DTFrRWyl02019 నుండి 2030 వరకు కాలభైరవ అష్టమి ఎప్పుడెప్పుడు? ఇది హిందూ నెల కార్తీక_ మార్గశిర బహుళ అష్టమి రోజుల్లో నిర్వహిస్తారు.. కొన్ని ప్రాంతాల్లో అనగా ఉత్తరభారతంలో కార్తీకంలో నిర్వహిస్తారు.. కొన్ని ప్రాంతాల్లో దక్షిణ భారతదేశంలో మార్గశిర బహుళ అష్టమి రోజున 2020 జనవరి 6 ఘనంగా నిర్వహిస్తారు. కాలభైరవ పూజ అంటే నిన్ను నువ్వు తెలుసు కోవడం.. నీ జన్మకు సార్థకత చేసుకోవడం, ధర్మానికి సత్యానికి దగ్గరగా జీవించడం.. "కాల భైరవ అష్టమి అంటే ఈ కాలం ద్వారా వచ్చే భయాలను బాధలను పోగొట్టి జయాన్ని పొందడం" అష్టమి అంటే జయ తిథి. ప్రతీ మాంసంలో కృష్ణ పక్షంలోని అష్టమిని కాలభైరవ ప్రీతి పాత్రమైన తిథి అంటారు. కాల భైరవ పవిత్రమైన రోజులు ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి. ఈ రోజుల్లో ఆయనను నమ్మకంతో భక్తి తో స్మరిస్తే ధర్మ బద్ధంగా ఏదైనా సాధ్యం అవుతుంది. దిగంబరుడు అంటే యదార్థం కు పరమార్డుడు, గ్రహరాజు, నవగ్రహాలకు అధినాయకుడు, ముఖ్యంగా శని యొక్క మూల గురువు, సర్పరాజు, దిగంబరుడు, క్షేత్రపాలకుడు, కాలరాజు, కాలాతీతుడు, కాల స్వరూపుడు, విధాత, సంధాత, దండ నాథుడు , పాప భాక్షుడు, శత్రు సంహారుడు, పిలుస్తారు (పాపులను శిక్షించడానికి కూడా పిలుస్తారు, స్వామి వారి వాహనం శునకం "కుక్క" అంటే విశ్వాసంము ప్రతీ రూపం.

Thursday, 12 November 2020

#ఎన్నోదుఃఖములనుదగ్దంచేసేదీపావళీఅమావాస్యస్నానం_పూజ #Share #Diwali14_11_2020స్వాత్యభ్యంగం స్నానం.. తైలాభ్యంగం స్నానం..స్వాతి నక్షత్రం వెళ్లిపోయేలోపు చేసే తైలం వేడి నీళ్లు స్నానం.లక్ష్మీ దీపం_ఎండుకొబ్బరిలో నువ్వులనూనెతో దీపం.దీపం పరబ్రహ్మ స్వరూపం.. అఙ్ఞానం అనే చీకట్లను తొలగించి ఙ్ఞానం వెలిగించేది దీపం.. నరక చతుర్దశి తర్వాతి రోజు వచ్చే దీపాల పండుగ దీపావళి. శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి దారి ముక్తిని ప్రసాదించిన రోజు. ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని, శ్రీరాముడు రావణుని వధించాక సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్య చేరుకుని పట్టాభిషక్తుడయ్యాక ప్రజలు ఆనందంతో పండుగ జరుపుకున్నారని, శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై నరకుని సంహరించిన సందర్భంగా సంతోషంతో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని ఇలా అనేకరకాలైన కథనాలు ఉన్నాయి. ఇంకా మరిన్ని వివరాలకు మన Facebook Page చూడగలరు. http://www.facebook.com/kalabhairavaTV మహాలయ పక్షంలో స్వర్గంనుంచి దిగివచ్చి భూలోకంలో తిరిగే పితృదేవతలు, ఈ రోజున పితృలోకానికి తిరిగి వెళతారని, వారికి వెలుతురు చూపించడం కోసం అలా ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందనేది మరో పురాణ కథనం. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యులకాంతికి మించిందని శాస్త్రవచనం. ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేయస్కరం, లక్ష్మీ ప్రదం. ఉదయం దీపం భగవంతుని కృతజ్ఞతలు తెలిపే దీపంగా చెబుతారు. సంధ్యాదీపం అంటే నూనెతో వెలిగించిన ప్రమిద, ఆ దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఉదయ దీపాన్ని దైవం దగ్గర, సంధ్యాదీపాన్ని ఇంటి ప్రధానద్వారపు గుమ్మం వద్ద వెలిగించి భక్తితో నమస్కరించాలి. దీపావళి నాడు ఉదయం 5 గంటలలోపే అభ్యంగనస్నానం పూర్తిచేయాలి. దీన్ని స్వాత్యభ్యంగం అంటారు.. అంటే స్వాతి నక్షత్రం వెళ్లిపోయేలోపు చేసే స్నానం. అనంతరం మధ్యాహ్నం పూట పితృదేవ‌తారాధన చేయాలి. ఇక, దీపావళి రోజు లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ ఆరాధన విధిగా చెయాలి.www.Kalabhairava.in అష్టైశ్వర్యాలు కోసం సాయంత్రం సమయంలోనే పూజ చేయాలి. ప్రతి పూజలోనూ మొదట వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని కుబేరుని ఈశ్వరుని స్వర్ణరూపం స్వర్ణాకర్షణభైరవ స్వామిని కలిపి పూజిస్తారు. పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని చేసి పంచ పూజలు చేస్తారు. ఎండుకొబ్బరిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి పూజ ప్రారంభించాలి. దీపావళి రోజున దీపాల వెలగించడమే సంప్రదాయం. హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం..

#DipavaliPuja14 నవంబర్20.దీపావళి పూజ విధానం: ఏం చేయాలి, ఏం చేయకూడదు?దీపావళి నిత్య కృత్యాలు:ఉదయాన్నే లేవడం తలస్నానం చేయడం మంచిది.కొత్త బట్టలు కట్టుకోవడం లేదా శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించడం మంచిది.ఇంకా మరిన్ని వివరాలకు మన Facebook Page లైక్ చేయండి. http://www.facebook.com/kalabhairavaTVఈరోజు చేయకూడనిది:మద్యమాంసాలను తీసుకోవడం పగలు పూట నిద్రపోవడం.ఈ రోజు ఇంటిలో ఏర్పాట్లు :గుమ్మాలకు మామిడి తోరణాలు ధరింపజేయడం ఇంటిలో దేవుడి పటానికి బొట్టు పూలతో అలంకరించి పూజించడము.పూజించే విధానం:ఇంట్లో పూజా మందిరంలో ఒక ప్లేట్ లో ఎరుపు రంగు వస్త్రాన్ని పరవాలి, దానిపైన దాన్యాన్ని లేడా బియ్యాన్ని పోయాలి, దారంతో కలశాన్ని అలంకరించి పైన కొబ్బరికాయతో స్థాపన చేయాలి.శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ ఫోటోలు పెట్టాలి.మీ ఏమైనా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే వాటికి లేదా రెండు రూపాయీ నాణెములకుఅభిషేకము గంధం, పసుపు, కుంకుమ, కలిపిన నీటి తో అభిషేకించాలి. పువ్వులతో అర్చించాలి. నైవేద్యము అరటిపండ్లు పాయసాన్నమునివేదించాలి.3మారేడు పత్రితో ఎరుపు అక్షతలతో శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణభైరవ స్వామి వారిని పూజించడం మరింత శుభకరం.నేతి హారతి సమర్పిస్తూ మంత్రం జపం చేయండి .వ్యాపారము,గృహం, అయినట్లయితే ముదిరిన కొబ్బరికాయ సిందూరం తో బొట్టు పెట్టి దిష్టి తీసి ఆరు బయట కొట్టాలి. పూజ అంతా అయిన తరువాత..పూజ విధానం అందరూ చేయదగిన విధంగా కింద అందించాము.మంత్రం: Lakshmi Kubera Swarnakarshana Mantra.*ఓమ్ నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వ్రుద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా*శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమః ధ్యాయామి. నమస్కరించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃఆవాహయామి అక్షతలు వేయాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃఆసనం సమర్పయామి పీటను ముట్టుకోవాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమః పాద్యం సమర్పయామి నీటిని చల్లాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃఅర్ఘ్యం పరికల్పయామి నీటిని చల్లాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃఆచమనీయం సమర్పయామి నీళ్లను కింద వదలాలిశ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃస్నానం పరికల్పయామి నీళ్లతో ఫోటో మీద గానీ విగ్రహము లేడా రుపాయు నాణెం పై చల్లాలి.శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃవస్త్రం సమర్పయామి మనకు తోచిన వస్త్రాన్ని సమర్పించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమః ఆభరణం పరికల్పయామి పత్రిని ఉంచాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమః గంధం సమర్పయామి చందనాన్ని చల్లాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమః అలంకరణం సమర్పయామి అలంకరణ కోసం పసుపు కుంకుమ పువ్వుతో చల్లాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃపుష్పాణి సమర్పయామి పువ్వులని పూలమాలని కలశానికి పటానికి అలంకరించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃధూపం సమర్పయామి అగరవత్తుల పొగని చూపించాలి, శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃదీపం దర్శయామి దీపాన్ని చూపించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃనైవేద్యం సమర్పయామి నైవేద్యాన్ని నివేదించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃతాంబూలం సమర్పయామి తమలపాకులు వక్క నీ తాంబూలంగా సమర్పించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃనీరాజనం దర్శయామి నేతి హారతిని చూపించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃమంత్ర పుష్పం పరికల్పయామి పుష్పాలను సమర్పించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃప్రదక్షిణం సమర్పయామి ముందు నిలబడి మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి,పువ్వులు అక్షతలు నీళ్ళు ఒక చిన్న ప్లేట్ లో వదులుతూ ఈ మాట చెప్పాలి, అనేన కృతేన పూజేన శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవఅర్పణ మస్తు... అని చెప్పాలి.ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మగవారు సాష్టాంగ నమస్కారం స్త్రీలు మోకరిల్లి నమస్కారం చేయండి. తదుపరి మీరు వదిలిన నీటిని తీర్ధంగా త్రాగాలి. అక్షతలు శిరస్సపై ధరించండి.ఈ విధంగా పూజించిన తర్వాత వ్యాపారులు డబ్బులని ఉంచే కౌంటర్ ని పూజించాలి అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టి దిష్టి తియ్యాలి.ఈ ఆ విధంగా పూజించినట్లయితే శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ పూజ పూర్తయినట్లు... ధన ధాన్య స్వర్ణ ఆరోగ్య రాజయోగ లక్ష్మీయోగ కుబేరయోగ విజయయోగ ప్రాప్తిరాస్తూ.... మీ కాలభైరవ గురు సంస్థాన్ మఠం రాజమండ్రి. ఆంధ్ర ప్రదేశ్.

Wednesday, 11 November 2020

కాలభైరవస్వామి అలా ఆవిర్భవించాడు? జగత్ గురువులు, శక్తిఉపాసకులు, ఆయుర్వేద నిపుణులు, పీఠాధిపతులు, మహర్షులు, స్వామీజీలు, భూత భవిష్యత్ వైతాళికులు, జాతకాలు చెప్పే మహానుభావులు, సిద్ధాంతులు, ధర్మం కోసం పోరాడేవారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాలభైరవుని ఖచ్చితంగా ఆశ్రయిస్తారు.. ఇంకా మరిన్ని వివరాలకు మన Facebook Page చూడగలరు. http://www.facebook.com/kalabhairavaTV #KalabhairavaAshtami#Kalabhairava_jayanthi_06_01_2021_Margashira_bahula_ashtami_ యదార్ధమునకు అసలైన అర్థం కాలభైరవ స్వామి.. అందుకే ఆయన దిగంబరంగా దర్శన మిస్తారు. దిగంబరంగా అంటే సత్యం ధర్మం. ప్రాచీనకాలం నాటి శైవక్షేత్రాలకి వెళితే అక్కడ తప్పనిసరిగా కన్పించే దర్శనం ఇచ్చే స్వరూపం భైరవ. మనలో ఉన్న భయాన్ని బాధలను పోగిట్టెలా, మనలో దాగిఉన్న శక్తి ని మేలుకొలిపేలా ఆయన రూపం వుంటుంది. కాశీ క్షేత్రపాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్ర పాలకుడిగా ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారు. అసితాంగ భైరవుడు .. రురు భైరవుడు .. చండ భైరవుడు .. క్రోధ భైరవుడు .. ఉన్మత్త భైరవుడు .. కపాల భైరవుడు .. భీషణ భైరవుడు .. సంహార భైరవుడు .. అనే ఎనిమిది నామాలతో ... వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ వుంటాడు.భైరవ అనే పేరే ఆయనలోని అపారమైన శక్తిని ఆవిష్కరిస్తున్నట్టుగా వుంటుంది. ఆయా క్షేత్రాలకి భైరవుడు పాలకుడని తెలిసినప్పుడు ... శునకాన్ని వాహనంగా కలిగిన ఆయన రూపాన్ని చూసినప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలగకపోదు. కాలభైరవుడు శివుడు నుంచి ఆవిర్భవించిన రుద్రాంశ సంభూతుడు. శివ ఉవాచ!! "నాకు సతీ వియోగం అయినప్పుడు నా దుఃఖాన్ని నిలువరించాడానికి నేనే కాలభైరవ అశ్రయించాను. భైరవున్ని స్మరిస్తే నన్ను పుజించినట్లే" అని సాక్షాత్తు శివుడే స్వయంగా తెలియజేస్తారు. కాశీ ఖండంలో.. అనుచితంగా గర్వంతో వ్యవహరించిన బ్రహ్మదేవుడి కి గర్వభంగం చేసి, పంచమ శిరస్సును ఖండిస్తాడు భైరవస్వరూపంతో..మహా పరాక్రమవంతుడైన రుద్రాంశ సంభూతుడు భైరవుడు క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడికి గల అయిదు శిరస్సుల్లో, ఏ శిరస్సు అయితే శివుడిని అవమానపరుస్తూ గర్వంతో మాట్లాడిందో ఆ శిరస్సును ఖండించి వేస్తాడు. ఆ తరువాత ధర్మ స్థాపన కోసం, బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికి తాను ఖండించినటు వంటి బ్రహ్మదేవుడి యొక్క కపాలంతో అనేక లోకాలు దర్శిస్తూ.. భూలోకం కాశీ క్షేత్రం అడుగిడగానే భైరవుడి చేతిలోని బ్రహ్మదేవుడి కపాలం కిందపడిన ప్రదేశమే నేడు 'బ్రహ్మ కపాలం' గా పిలవబడుతోంది. కాశీక్షేత్రానికి భైరవుడు అక్కడ క్షేత్రపాలకుడిగా ఉండిపోతాడు. అంటే ఆయన క్షేత్రానికి ఆయనే క్షేత్ర పాలకుడు. ఆ తరువాత అనేక శైవక్షేత్రాల్లో ఆయన మూర్తిని క్షేత్రపాలక స్వామి గా ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రాల్లో భైరవుడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించబడుతూ వుంటాడు. ఈ స్వామిని ఆరాధించడం వలన దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందనీ, గ్రహ శాపాలు, శత్రు శాపాలు, రోగ బాధలు, ఈతి బాధలు, దుఃఖ దారిద్ర్యములు, తొలగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, పాడిపంటలు వృద్ధి చెందుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.===========క్షేత్రపాలకుడు, దండనాధుడు, ఆపడుద్ధరకుడు, పాపభక్షుడు, కాలభైరవస్వామి.#మీకాలభైరవగురు#నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వూ మార్చుకో, నిన్ను నువ్వు అభివృద్ధి పరుచుకో..గుడ్డి గా ఎవరిని నమ్మవద్దు..నీ ధనం,కాలం వ్రుదా చేసుకోవద్దు...ఇదే కాలభైరవగురు తత్వం.

Thursday, 5 November 2020

జప సాధన ఏలా చేయాలి? #జపం_జపమాల_ఫలితాలు#పవర్_ఫుల్_మంత్రాలు #షేర్_చేయండిజపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మానవుడు ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అన్ని యజ్ఞాలకన్నా 'జపయజ్ఞం' గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశం. అందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మడు.. అర్జునిడితో, ‘యజ్ఞానాం జప యజ్ఞోస్మీ అని చెబుతాడు. అంటే.. యజ్ఞాలన్నింటిలో తాను జపయజ్ఞాన్ని.. అని చెబుతాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.మనోభీష్టం నెరవేరేందుకు జపం చేసుకోవాల్సిందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి దివ్యమైన నామాన్ని 108 సార్లు జపించినట్టు తెలియడానికిగాను అందరూ జపమాలలు వాడుతుంటారు. జపమాలలు 3 రకాలు1. కరమాలఅనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలం వరకు గల 10 కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లవుతుంది.2. అక్షమాల‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా ’క్షా కల్మషాలను తొలగిస్తుంది.3. మణిమాలలురుద్రాక్ష మాలలు, హకీక్ మాలలు, ముత్యాల మాలలు, స్పటిక మాలలు శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.ఫలితములురుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం, హాకీక్ మాలతో జపం శత్రు,గ్రహ,రోగ నివారణం, ఆకర్షణ శక్తి, వశీకరణ శక్తి, ఐశ్వర్య వృద్ధి, సర్వమంగళం, తులసి మాలతో చెస్తే కలిగి ముక్తి, మోక్షం కలుగుతుంది.జపం 3 విధాలుగా ఉంటుంది1. వాచింకంమంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.2. ఉపాంశువుతనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.3. మానసికంమనస్సులోనే మంత్రాన్ని జపించడం.వాచిక జపం కంటే ఉపాంశు జపం 100 రేట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం 1000 రేట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, మొదట్లో చిన్న చిన్న తేడా లు వస్తాయి. నిరంతరంగా సాధన చేస్తే సరి అవుతుంది. జపం చేసేటప్పుడు పూర్తి విశ్వాసం సంకల్పం భక్తి శ్రద్ధ ఉంటే చాలు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించ డానికి ప్రయత్నం చేయాలి. జపానికి ముందు మంత్ర దేవతకు, గురువు గారికి, తల్లితండ్రులకు, కుల దేవతకు, గ్రామ దేవతకి నమస్కరించాలి.ఎలా చేయాలి..?తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. అవకాశం ఉంటే మాలను పంచ పూజలు గంధం,పుష్పం, ధూప దీపం నైవేద్యం సమర్పించి ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించి జపం మొదలు పెట్టవచ్చు.అనంతరం సుఖాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వేళ్ళపై ఉంచి, చేతి బోటని వేలితో, మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని ధర్మ శాస్త్రం చెపుతోంది.దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాసనం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. మాలతో జపం చేయడం వల్ల శీఘ్రం గా అభీష్ట సిద్ధి కలుగుతుంది.. మనిషిగా జన్మించిన ప్రతీ ఒక్కరు జపం చేయడానికి అర్హులే.. కులం మతం వర్ణం లింగ భేదం లేదు.. ఇంకా మరిన్ని వివరాలకు మన Facebook Page చూడగలరు. http://www.facebook.com/kalabhairavaTV Lakshmi Ganapathi లక్ష్మీ గణపతి మంత్రం"ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనంమే వశమానయ స్వాహా"Vatuka Bhairava."ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం" Batuka Bhairavaఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు బటుకాయ హ్రీం ఓం Swarnakarshana*ఓమ్ నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వ్రుద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా* Dasanama Rakshaఓం కపాలి,కుండలీ ,భీమో, భైరవో ,భీమవిక్రమః, వ్యాలోపవీతీ ,కవచీ , శూలీ, శూరః ,శివప్రియః Shatru nivaranaఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం సర్వ శతృం శ్రీఘ్రం మమ వశం వశం కురు కురు స్వాహా..5మాలలు 5*108 Temple Address Google Link.. Swarnakarshana Bhairava TempleKalabhairava Guru SANSTHAN Mutt Kalabhairava Deekshaa Ghat, Aryapuram, Rajahmundry, A.P 53310409618182456https://maps.app.goo.gl/9q9bJ

Friday, 30 October 2020

శరత్ పూర్ణిమ - విశిష్టతఈ రోజు (31-10-2020, శనివారము) శరత్ పూర్ణిమ. ఆశ్వీయుజ పూర్ణిమకే శరత్ పూర్ణిమ అని పేరు. ఇది అమ్మవారి (శక్తి) ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు, మంత్ర సాధకులు, దశ మహా విద్యలు దీక్షా పరులు, గురువులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజించడం, చంద్ర కాంతిలో మంత్ర జపం చేయడం మంచిది. ఈ శరత్ పూర్ణిమ రోజున చందకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువలన చంద్రకాంతిలో కూర్చుని ఏదైనా దశ మహా విద్య మంత్రం, స్వర్ణ ఆకర్షణ భైరవ మంత్రం, కాలభైరవ సహస్రనామ పారాయణ చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాల లో ఉన్న ఓషిధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేధ్యంగా స్వీకరించాలి.ఈ పూర్ణిమకే కోజాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరీ పూర్ణిమ రోజున ప్రత్యేకంగా స్వర్ణ భైరవుని పూజిస్తారు.అందరికి శరత్ పూర్ణిమ శుభాకాంక్షలు. మీ కాలభైరవ స్వామి

Thursday, 29 October 2020

2020నవంబర్ నెలలో స్వామి వారి దర్శనం#భారతీయసనాతనధర్మంవర్ధిల్లాలి!! 2020నవంబర్_నెలలో స్వామివారి దర్శనం.01-11ఆదివారం, 8-11ఆదివారం, 09-11అష్టమి సోమవారం,15-11దీపావళీ అమావాస్య ఆదివారం, 22-11అష్టమి ఆదివారం, 29-11ఆదివారం, 30-11కార్తీక పౌర్ణమి సోమవారం.#06_01_21బుధవారంమార్గశిరబహుళఅష్టమికాలభైరవవాష్టమికాలభైరవజయంతి #ధనమును(నాణాలను) ప్రసాదంగా ఇచ్చే ప్రపంచ ప్రఖ్యాత ఏకైక శ్రీలక్ష్మీకుబేర స్వర్ణాకర్షణభైరవస్వామివారు. గోదావరిగట్టుకాలభైరవ దీక్షాఘాట్,రాజమండ్రి ఆం.ప్ర.దర్శనం.ఆదివారం, అష్టమి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో మాత్రమే ఉ.9గ.నుండి ఉ.11:45ని. వరకు ఉంటుంది. ఏవిధమైన పూజా సామాగ్రి తీసుకురావద్దు.. భక్తి శ్రద్ద విశ్వాసంతో మాత్రమే దర్శించండి.మన మఠం నిర్వహించు సేవలు:*భారతీయ సనాతన,ధర్మ ప్రచారసేవ*ఉచితదర్శనసేవ*ఉచితజలాభిషేకసేవ*ఉచితహారతిదర్శనసేవ*ఉచితధనప్రసాదసేవ*ఉచితఅన్నప్రసాదసేవ*ఉచిత మంత్ర ఉపదేశ సేవ*ఉచిత జాతకపరిహార సేవ*మాతృపితృ పాదపూజా ప్రచార సేవ *కాలభైరవ గ్రీన్ ఇండియాభారత్ మాతా కీ జై!!*20డిసెంబర్_నెలలో స్వామి వారి దర్శనం6-12ఆదివారం, 8-12అష్టమి, 13-13ఆదివారం, 14-12కార్తీక అమావాస్య సోమ వారం, 20-12ఆదివారం, 22-12అష్టమి, 27-12ఆదివారం, 30-12మార్గశిరపౌర్ణమి.*జనవరి2021_నెలలోదర్శనం03-1-21ఆదివారం, 06_01_21బుధవారంమార్గశిరబహుళఅష్టమికాలభైరవవాష్టమికాలభైరవజయంతి.*మరిన్ని వివరాలకు Telegramhttps://t.me/kalabhairavaTv*మరిన్ని వివరాలకు Followhttp://www.facebook.com/kalabhairavaTVమరిన్ని వివరాలకు Subscribehttps://www.youtube.com/c/KALABHAIRAVAGURU*మరిన్ని వివరాలకు KalabhairavaTv.http://youtube.com/c/Kalabhairavatv*ఓమ్ నమోభగవతేస్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా*