Thursday, 12 November 2020
#ఎన్నోదుఃఖములనుదగ్దంచేసేదీపావళీఅమావాస్యస్నానం_పూజ #Share #Diwali14_11_2020స్వాత్యభ్యంగం స్నానం.. తైలాభ్యంగం స్నానం..స్వాతి నక్షత్రం వెళ్లిపోయేలోపు చేసే తైలం వేడి నీళ్లు స్నానం.లక్ష్మీ దీపం_ఎండుకొబ్బరిలో నువ్వులనూనెతో దీపం.దీపం పరబ్రహ్మ స్వరూపం.. అఙ్ఞానం అనే చీకట్లను తొలగించి ఙ్ఞానం వెలిగించేది దీపం.. నరక చతుర్దశి తర్వాతి రోజు వచ్చే దీపాల పండుగ దీపావళి. శ్రీమహావిష్ణువు వామనుడిగా అవతరించి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి దారి ముక్తిని ప్రసాదించిన రోజు. ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని, శ్రీరాముడు రావణుని వధించాక సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్య చేరుకుని పట్టాభిషక్తుడయ్యాక ప్రజలు ఆనందంతో పండుగ జరుపుకున్నారని, శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై నరకుని సంహరించిన సందర్భంగా సంతోషంతో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని ఇలా అనేకరకాలైన కథనాలు ఉన్నాయి. ఇంకా మరిన్ని వివరాలకు మన Facebook Page చూడగలరు. http://www.facebook.com/kalabhairavaTV మహాలయ పక్షంలో స్వర్గంనుంచి దిగివచ్చి భూలోకంలో తిరిగే పితృదేవతలు, ఈ రోజున పితృలోకానికి తిరిగి వెళతారని, వారికి వెలుతురు చూపించడం కోసం అలా ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందనేది మరో పురాణ కథనం. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యులకాంతికి మించిందని శాస్త్రవచనం. ఆవునేతితో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేయస్కరం, లక్ష్మీ ప్రదం. ఉదయం దీపం భగవంతుని కృతజ్ఞతలు తెలిపే దీపంగా చెబుతారు. సంధ్యాదీపం అంటే నూనెతో వెలిగించిన ప్రమిద, ఆ దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఉదయ దీపాన్ని దైవం దగ్గర, సంధ్యాదీపాన్ని ఇంటి ప్రధానద్వారపు గుమ్మం వద్ద వెలిగించి భక్తితో నమస్కరించాలి. దీపావళి నాడు ఉదయం 5 గంటలలోపే అభ్యంగనస్నానం పూర్తిచేయాలి. దీన్ని స్వాత్యభ్యంగం అంటారు.. అంటే స్వాతి నక్షత్రం వెళ్లిపోయేలోపు చేసే స్నానం. అనంతరం మధ్యాహ్నం పూట పితృదేవతారాధన చేయాలి. ఇక, దీపావళి రోజు లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ ఆరాధన విధిగా చెయాలి.www.Kalabhairava.in అష్టైశ్వర్యాలు కోసం సాయంత్రం సమయంలోనే పూజ చేయాలి. ప్రతి పూజలోనూ మొదట వినాయకుడిని ఆరాధించడం సంప్రదాయం. లక్ష్మీదేవిని కుబేరుని ఈశ్వరుని స్వర్ణరూపం స్వర్ణాకర్షణభైరవ స్వామిని కలిపి పూజిస్తారు. పూజలో భాగంగా ముందుగా పసుపుతో వినాయకుడిని చేసి పంచ పూజలు చేస్తారు. ఎండుకొబ్బరిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి పూజ ప్రారంభించాలి. దీపావళి రోజున దీపాల వెలగించడమే సంప్రదాయం. హిందువుల పండుగలలో దీపావళి ప్రత్యేకమైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment