Thursday, 5 November 2020
జప సాధన ఏలా చేయాలి? #జపం_జపమాల_ఫలితాలు#పవర్_ఫుల్_మంత్రాలు #షేర్_చేయండిజపతపాలతో భగవంతుడిని ఆరాధించడం వల్ల మానవుడు ఆయన మనసును తొందరగా గెలుచుకోవచ్చునని పురాణాలు చెబుతున్నాయి. అన్ని యజ్ఞాలకన్నా 'జపయజ్ఞం' గొప్పదని మనుస్మృతి చెబుతోంది. జపంలోని ‘జా – జన్మవిఛ్చేదనం చేసేది. ‘పా అంటె పాపాన్ని నశింపచేసేదని అర్థం. యోగానికి జపం ఒక ముఖ్యాంశం. అందువల్లే భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మడు.. అర్జునిడితో, ‘యజ్ఞానాం జప యజ్ఞోస్మీ అని చెబుతాడు. అంటే.. యజ్ఞాలన్నింటిలో తాను జపయజ్ఞాన్ని.. అని చెబుతాడు. జపం చేస్తున్నప్పుడు భగవన్నామాన్ని లేక కొన్ని మంత్రాలనుగానీ పఠించడం జరుగుతుంది. మనసు అనేక సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, జపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.మనోభీష్టం నెరవేరేందుకు జపం చేసుకోవాల్సిందే. జపమాలలోను 108 పూసలు వుంటాయి. ఇది విశేషమైన సంఖ్యగా చెబుతుంటారు. ప్రతినిత్యం ఈ సంఖ్య ప్రకారం భగవంతుడి నామాన్ని స్మరించడం వలన అనంతమైన ఫలితాలు కలుగుతాయి. భగవంతుడి దివ్యమైన నామాన్ని 108 సార్లు జపించినట్టు తెలియడానికిగాను అందరూ జపమాలలు వాడుతుంటారు. జపమాలలు 3 రకాలు1. కరమాలఅనామిక మధ్య కణుపు నుంచి ప్రారంభించి కనిష్టాదిగా తర్జనీమూలం వరకు గల 10 కణుపులలో ప్రదిక్షిణంగా జపించితే కరమాలతో జపించినట్లవుతుంది.2. అక్షమాల‘ఆ నుంచి ‘క్షా వరకు గల 54 అక్షరాలతో జపించడమే అక్షమాల. ‘ఆ అనంతఫలితాన్ని కలిగిస్తుండగా ’క్షా కల్మషాలను తొలగిస్తుంది.3. మణిమాలలురుద్రాక్ష మాలలు, హకీక్ మాలలు, ముత్యాల మాలలు, స్పటిక మాలలు శంఖాలు, పగడాలు, సువర్ణమాలలు, రజితమాలలు తులసిపూసలు, కుశదర్భమాలలు, పద్మబీజాలు, పుత్రజీవాలు ఉపయోగించి చేయబడిన మాలలను మణిమాలలని అంటారు.ఫలితములురుద్రాక్షమాలతో జపం చేస్తే ఆత్మజ్ఞానం, హాకీక్ మాలతో జపం శత్రు,గ్రహ,రోగ నివారణం, ఆకర్షణ శక్తి, వశీకరణ శక్తి, ఐశ్వర్య వృద్ధి, సర్వమంగళం, తులసి మాలతో చెస్తే కలిగి ముక్తి, మోక్షం కలుగుతుంది.జపం 3 విధాలుగా ఉంటుంది1. వాచింకంమంత్రబీజాక్షరాలను తన చుట్టూ ఉన్నవారికి వినిపించేటట్లు పలుకుతూ జపం చేయడం వాచికం అనబడుతుంది.2. ఉపాంశువుతనకు అత్యంత సమీపంలో ఉన్నవారికి మాత్రమే వినిపించేటట్లు పెదవులను కదుపుతూ జపం చేయడం ఉపాంశువు అని పిలువబడుతుంది.3. మానసికంమనస్సులోనే మంత్రాన్ని జపించడం.వాచిక జపం కంటే ఉపాంశు జపం 100 రేట్లు ఫలితాన్ని కలిగిస్తూ ఉండగా, ఉపాంశుజపం కంటే మానసిక జపం 1000 రేట్లు ఫలితాన్ని కలిగిస్తుంటుంది. అయితే, మొదట్లో చిన్న చిన్న తేడా లు వస్తాయి. నిరంతరంగా సాధన చేస్తే సరి అవుతుంది. జపం చేసేటప్పుడు పూర్తి విశ్వాసం సంకల్పం భక్తి శ్రద్ధ ఉంటే చాలు. మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించ డానికి ప్రయత్నం చేయాలి. జపానికి ముందు మంత్ర దేవతకు, గురువు గారికి, తల్లితండ్రులకు, కుల దేవతకు, గ్రామ దేవతకి నమస్కరించాలి.ఎలా చేయాలి..?తూర్పుముఖంగా కానీ, ఉత్తరముఖంగా కాని కూర్చుని జపం చేయాలి. జపం చేయడానికి కాలం గురించి పట్టింపులేదు. అవకాశం ఉంటే మాలను పంచ పూజలు గంధం,పుష్పం, ధూప దీపం నైవేద్యం సమర్పించి ఏ మంత్రాన్ని జపించేందుకు ఆ మాలను ఉపయోగించదలచుకున్నారో, ఆ మంత్రంతోనే ఆ జపమాలను పూజించి జపం మొదలు పెట్టవచ్చు.అనంతరం సుఖాసనంలో కూర్చుని, జపమాలను కుడిచేతిలో ఉంచుకుని, మధ్య, అనామిక, కనిష్ఠ వేళ్ళపై ఉంచి, చేతి బోటని వేలితో, మధ్య వేలిపై నొక్కి జపమాలను తిప్పాలి. ఓషధులసారమే దర్భలని అలాంటి ఆసనం మంచిదని ధర్మ శాస్త్రం చెపుతోంది.దర్భాసనం వేసుకొనిగాని, చిత్రాసనం మీద గాని చేయవచ్చు. జపం చేయడానికి కాలనియమం లేదని, దీక్ష, హొమాలతో కూడా పనిలేదని బ్రహ్మోత్తర ఖండంలో ఉంది. అందరూ దీనికి అధికారులేనని అగస్త్యసంహితలో ఉంది. అలాగే జపమాలలో 108 లేక 54 లేక 27 పూసలు ఉంటుంటాయి. దీనివెనుక ఓ అర్థం ఉంది. మన శరీరంలో 72000 నాడులున్నాయి. వాటిలో హృదయానికి సంబంధించినవి 108. అందుకనే 108 జప సంఖ్యగా అమలులోకి వచ్చింది. మాలలో ఒక పెద్దపూసను మేరువు పూసగా ఉంచుకోవాలి. ఈ మేరువు పూస లెక్కలోకి రాదు. మాలతో జపం చేయడం వల్ల శీఘ్రం గా అభీష్ట సిద్ధి కలుగుతుంది.. మనిషిగా జన్మించిన ప్రతీ ఒక్కరు జపం చేయడానికి అర్హులే.. కులం మతం వర్ణం లింగ భేదం లేదు.. ఇంకా మరిన్ని వివరాలకు మన Facebook Page చూడగలరు. http://www.facebook.com/kalabhairavaTV Lakshmi Ganapathi లక్ష్మీ గణపతి మంత్రం"ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వర వరద సర్వజనంమే వశమానయ స్వాహా"Vatuka Bhairava."ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం" Batuka Bhairavaఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు బటుకాయ హ్రీం ఓం Swarnakarshana*ఓమ్ నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వ్రుద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా* Dasanama Rakshaఓం కపాలి,కుండలీ ,భీమో, భైరవో ,భీమవిక్రమః, వ్యాలోపవీతీ ,కవచీ , శూలీ, శూరః ,శివప్రియః Shatru nivaranaఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం సర్వ శతృం శ్రీఘ్రం మమ వశం వశం కురు కురు స్వాహా..5మాలలు 5*108 Temple Address Google Link.. Swarnakarshana Bhairava TempleKalabhairava Guru SANSTHAN Mutt Kalabhairava Deekshaa Ghat, Aryapuram, Rajahmundry, A.P 53310409618182456https://maps.app.goo.gl/9q9bJ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment