Wednesday 11 November 2020

కాలభైరవస్వామి అలా ఆవిర్భవించాడు? జగత్ గురువులు, శక్తిఉపాసకులు, ఆయుర్వేద నిపుణులు, పీఠాధిపతులు, మహర్షులు, స్వామీజీలు, భూత భవిష్యత్ వైతాళికులు, జాతకాలు చెప్పే మహానుభావులు, సిద్ధాంతులు, ధర్మం కోసం పోరాడేవారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కాలభైరవుని ఖచ్చితంగా ఆశ్రయిస్తారు.. ఇంకా మరిన్ని వివరాలకు మన Facebook Page చూడగలరు. http://www.facebook.com/kalabhairavaTV #KalabhairavaAshtami#Kalabhairava_jayanthi_06_01_2021_Margashira_bahula_ashtami_ యదార్ధమునకు అసలైన అర్థం కాలభైరవ స్వామి.. అందుకే ఆయన దిగంబరంగా దర్శన మిస్తారు. దిగంబరంగా అంటే సత్యం ధర్మం. ప్రాచీనకాలం నాటి శైవక్షేత్రాలకి వెళితే అక్కడ తప్పనిసరిగా కన్పించే దర్శనం ఇచ్చే స్వరూపం భైరవ. మనలో ఉన్న భయాన్ని బాధలను పోగిట్టెలా, మనలో దాగిఉన్న శక్తి ని మేలుకొలిపేలా ఆయన రూపం వుంటుంది. కాశీ క్షేత్రపాలకుడిగానే కాకుండా అనేక క్షేత్రాల్లో ఆయన క్షేత్ర పాలకుడిగా ఆ క్షేత్రాన్ని రక్షిస్తూ ఉంటారు. అసితాంగ భైరవుడు .. రురు భైరవుడు .. చండ భైరవుడు .. క్రోధ భైరవుడు .. ఉన్మత్త భైరవుడు .. కపాల భైరవుడు .. భీషణ భైరవుడు .. సంహార భైరవుడు .. అనే ఎనిమిది నామాలతో ... వివిధ ముద్రలతో భైరవుడు దర్శనమిస్తూ వుంటాడు.భైరవ అనే పేరే ఆయనలోని అపారమైన శక్తిని ఆవిష్కరిస్తున్నట్టుగా వుంటుంది. ఆయా క్షేత్రాలకి భైరవుడు పాలకుడని తెలిసినప్పుడు ... శునకాన్ని వాహనంగా కలిగిన ఆయన రూపాన్ని చూసినప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కలగకపోదు. కాలభైరవుడు శివుడు నుంచి ఆవిర్భవించిన రుద్రాంశ సంభూతుడు. శివ ఉవాచ!! "నాకు సతీ వియోగం అయినప్పుడు నా దుఃఖాన్ని నిలువరించాడానికి నేనే కాలభైరవ అశ్రయించాను. భైరవున్ని స్మరిస్తే నన్ను పుజించినట్లే" అని సాక్షాత్తు శివుడే స్వయంగా తెలియజేస్తారు. కాశీ ఖండంలో.. అనుచితంగా గర్వంతో వ్యవహరించిన బ్రహ్మదేవుడి కి గర్వభంగం చేసి, పంచమ శిరస్సును ఖండిస్తాడు భైరవస్వరూపంతో..మహా పరాక్రమవంతుడైన రుద్రాంశ సంభూతుడు భైరవుడు క్షణమైనా ఆలస్యం చేయకుండా బ్రహ్మదేవుడికి గల అయిదు శిరస్సుల్లో, ఏ శిరస్సు అయితే శివుడిని అవమానపరుస్తూ గర్వంతో మాట్లాడిందో ఆ శిరస్సును ఖండించి వేస్తాడు. ఆ తరువాత ధర్మ స్థాపన కోసం, బ్రహ్మహత్యాపాతకం నుంచి బయటపడటానికి తాను ఖండించినటు వంటి బ్రహ్మదేవుడి యొక్క కపాలంతో అనేక లోకాలు దర్శిస్తూ.. భూలోకం కాశీ క్షేత్రం అడుగిడగానే భైరవుడి చేతిలోని బ్రహ్మదేవుడి కపాలం కిందపడిన ప్రదేశమే నేడు 'బ్రహ్మ కపాలం' గా పిలవబడుతోంది. కాశీక్షేత్రానికి భైరవుడు అక్కడ క్షేత్రపాలకుడిగా ఉండిపోతాడు. అంటే ఆయన క్షేత్రానికి ఆయనే క్షేత్ర పాలకుడు. ఆ తరువాత అనేక శైవక్షేత్రాల్లో ఆయన మూర్తిని క్షేత్రపాలక స్వామి గా ప్రతిష్ఠించారు. ఆ క్షేత్రాల్లో భైరవుడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించబడుతూ వుంటాడు. ఈ స్వామిని ఆరాధించడం వలన దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుందనీ, గ్రహ శాపాలు, శత్రు శాపాలు, రోగ బాధలు, ఈతి బాధలు, దుఃఖ దారిద్ర్యములు, తొలగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, పాడిపంటలు వృద్ధి చెందుతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.===========క్షేత్రపాలకుడు, దండనాధుడు, ఆపడుద్ధరకుడు, పాపభక్షుడు, కాలభైరవస్వామి.#మీకాలభైరవగురు#నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వూ మార్చుకో, నిన్ను నువ్వు అభివృద్ధి పరుచుకో..గుడ్డి గా ఎవరిని నమ్మవద్దు..నీ ధనం,కాలం వ్రుదా చేసుకోవద్దు...ఇదే కాలభైరవగురు తత్వం.

No comments:

Post a Comment