Thursday, 12 November 2020
#DipavaliPuja14 నవంబర్20.దీపావళి పూజ విధానం: ఏం చేయాలి, ఏం చేయకూడదు?దీపావళి నిత్య కృత్యాలు:ఉదయాన్నే లేవడం తలస్నానం చేయడం మంచిది.కొత్త బట్టలు కట్టుకోవడం లేదా శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించడం మంచిది.ఇంకా మరిన్ని వివరాలకు మన Facebook Page లైక్ చేయండి. http://www.facebook.com/kalabhairavaTVఈరోజు చేయకూడనిది:మద్యమాంసాలను తీసుకోవడం పగలు పూట నిద్రపోవడం.ఈ రోజు ఇంటిలో ఏర్పాట్లు :గుమ్మాలకు మామిడి తోరణాలు ధరింపజేయడం ఇంటిలో దేవుడి పటానికి బొట్టు పూలతో అలంకరించి పూజించడము.పూజించే విధానం:ఇంట్లో పూజా మందిరంలో ఒక ప్లేట్ లో ఎరుపు రంగు వస్త్రాన్ని పరవాలి, దానిపైన దాన్యాన్ని లేడా బియ్యాన్ని పోయాలి, దారంతో కలశాన్ని అలంకరించి పైన కొబ్బరికాయతో స్థాపన చేయాలి.శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ ఫోటోలు పెట్టాలి.మీ ఏమైనా చిన్న చిన్న విగ్రహాలు ఉంటే వాటికి లేదా రెండు రూపాయీ నాణెములకుఅభిషేకము గంధం, పసుపు, కుంకుమ, కలిపిన నీటి తో అభిషేకించాలి. పువ్వులతో అర్చించాలి. నైవేద్యము అరటిపండ్లు పాయసాన్నమునివేదించాలి.3మారేడు పత్రితో ఎరుపు అక్షతలతో శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణభైరవ స్వామి వారిని పూజించడం మరింత శుభకరం.నేతి హారతి సమర్పిస్తూ మంత్రం జపం చేయండి .వ్యాపారము,గృహం, అయినట్లయితే ముదిరిన కొబ్బరికాయ సిందూరం తో బొట్టు పెట్టి దిష్టి తీసి ఆరు బయట కొట్టాలి. పూజ అంతా అయిన తరువాత..పూజ విధానం అందరూ చేయదగిన విధంగా కింద అందించాము.మంత్రం: Lakshmi Kubera Swarnakarshana Mantra.*ఓమ్ నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వ్రుద్దికరాయ శ్రీఘ్రమ్ ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా*శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమః ధ్యాయామి. నమస్కరించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃఆవాహయామి అక్షతలు వేయాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃఆసనం సమర్పయామి పీటను ముట్టుకోవాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమః పాద్యం సమర్పయామి నీటిని చల్లాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃఅర్ఘ్యం పరికల్పయామి నీటిని చల్లాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃఆచమనీయం సమర్పయామి నీళ్లను కింద వదలాలిశ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃస్నానం పరికల్పయామి నీళ్లతో ఫోటో మీద గానీ విగ్రహము లేడా రుపాయు నాణెం పై చల్లాలి.శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃవస్త్రం సమర్పయామి మనకు తోచిన వస్త్రాన్ని సమర్పించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమః ఆభరణం పరికల్పయామి పత్రిని ఉంచాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమః గంధం సమర్పయామి చందనాన్ని చల్లాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమః అలంకరణం సమర్పయామి అలంకరణ కోసం పసుపు కుంకుమ పువ్వుతో చల్లాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃపుష్పాణి సమర్పయామి పువ్వులని పూలమాలని కలశానికి పటానికి అలంకరించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃధూపం సమర్పయామి అగరవత్తుల పొగని చూపించాలి, శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃదీపం దర్శయామి దీపాన్ని చూపించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃనైవేద్యం సమర్పయామి నైవేద్యాన్ని నివేదించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃతాంబూలం సమర్పయామి తమలపాకులు వక్క నీ తాంబూలంగా సమర్పించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃనీరాజనం దర్శయామి నేతి హారతిని చూపించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃమంత్ర పుష్పం పరికల్పయామి పుష్పాలను సమర్పించాలి,శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవాయ నమఃప్రదక్షిణం సమర్పయామి ముందు నిలబడి మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి,పువ్వులు అక్షతలు నీళ్ళు ఒక చిన్న ప్లేట్ లో వదులుతూ ఈ మాట చెప్పాలి, అనేన కృతేన పూజేన శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవఅర్పణ మస్తు... అని చెప్పాలి.ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మగవారు సాష్టాంగ నమస్కారం స్త్రీలు మోకరిల్లి నమస్కారం చేయండి. తదుపరి మీరు వదిలిన నీటిని తీర్ధంగా త్రాగాలి. అక్షతలు శిరస్సపై ధరించండి.ఈ విధంగా పూజించిన తర్వాత వ్యాపారులు డబ్బులని ఉంచే కౌంటర్ ని పూజించాలి అక్కడ కూడా ఒక కొబ్బరికాయ కొట్టి దిష్టి తియ్యాలి.ఈ ఆ విధంగా పూజించినట్లయితే శ్రీలక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ పూజ పూర్తయినట్లు... ధన ధాన్య స్వర్ణ ఆరోగ్య రాజయోగ లక్ష్మీయోగ కుబేరయోగ విజయయోగ ప్రాప్తిరాస్తూ.... మీ కాలభైరవ గురు సంస్థాన్ మఠం రాజమండ్రి. ఆంధ్ర ప్రదేశ్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment